వరదల్లో చిక్కుకొన్న తెలుగు సీనియర్ నటి.. ఆచూకీ గల్లంతు.. తెలంగాణ సర్కారుకు ఫిర్యాదు
టాలీవుడ్‌లో సినియర్ నటి సరళా కుమారి ఫ్యామిలీ తీవ్ర దిగ్రాంతిలో మునిగిపోయింది. విహార యాత్రకు వెళ్లిన నటికి ఊహించని పరిస్థితి ఎదురు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. తమ తల్లి ఆచూకీ తెలియడం లేదని అధికారులను సంప్రదించారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అలనాటి నటి సరళా కుమారి 1983 సంవత్సరంలో మిస్ ఆంధ్రా కిరిటాన్ని గెలుచుకొని వినోద రంగంలోకి ప్రవేశించారు. పలు సినిమాల్లో నటించి తనదైన శైలిలో మెప్పించారు. సంఘర్షణ, ఎన్టీఆర్‌తో దానవీరశూర కర్ణ లాంటి సినిమాల్లో నటించారు. సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లో శేష జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటీవల తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సరళ కుమారి సిక్కింలో విహారయాత్రకు వెళ్లారు. అయితే అనూహ్యంగా సిక్కింలో పరిస్థితులు మారడంతో ఆమె కష్టాల్లో చిక్కుకున్నారు. సిక్కింలోని పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో ఆమె ఆచూకీ గల్లంతైంది. దాంతో సరళ కుమారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు.
తన తల్లి కనిపించడం లేదని అమెరికాలో ఉన్న సరళ కుమారి కూతరు నిభిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి గురించి వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కోరింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విపత్తు నివారణ విభాగాన్ని ఆశ్రయించారు.
తన తల్లి సూర్య కుమారి సిక్కిం రాష్ట్రంలో వినోదయాత్రకు వెళ్లారు. ఆమె ప్రతీ రోజు మాట్లాడుతూనే ఉన్నాను. నా తల్లితో అక్టోబర్ 3వ తేదీన చివరిసారిగా మాట్లాడాను. ఆ తర్వాత నా తల్లితో మాట్లాడానికి ప్రయత్నించగా కుదర్లేదు. సిక్కింలోని పలు ప్రాంతాలను ఆ సమయంలోనే వరదలు ముంచెత్తాయని తెలిసింది. దాంతో సిక్కింలోని పర్యాటక విభాగాన్ని ప్రయత్నించాం. అయితే సమాచారం రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నాం అని నభియా చెప్పారు.


Click it and Unblock the Notifications











