Sarangapani Jathakam Trailer Review: సారంగపాణి జాతకం ట్రైలర్ రివ్యూ.. హస్త ప్రయోగం కాదు.. హత్య ప్రయత్నం

కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. జెంటిల్ మ్యాన్, సమ్మోహనం హిట్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణప్రసాద్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ శరేవేగంగా సాగుతున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, వైవా హర్ష, సాయి శ్రీనివాస్ వడ్లమాని, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ పాల్గొన్నారు. ఈ ట్రైలర్ ఎలాంటి అనుభూతిని కలిగించిందనే రివ్యూలోకి వెళితే..

Sarangapani Jathakam Trailer Review

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీ బ్యానర్‌పై రూపొందిన సారంగపాణి జాతకం మూవీ ప్రేమ, పెళ్లి, క్రైమ్ అంశాలతో పూర్తిస్థాయి వినోదభరిత చిత్రంగా రూపొందింది. పెళ్లి చేసుకోవడానికి సారంగపాణి (ప్రియదర్శి) పడే పాట్లు ఈ ట్రైలర్‌లో కనిపించాయి. ఇక ప్రేమ ఫలించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడినా.. పెళ్లి ఎందుకు ఆగిపోయిందనేది ఈ సినిమా ట్విస్ట్‌గా ట్రైలర్‌లో కనిపించింది. పెళ్లి ఆగిపోవడానికి కారణం హత్యయత్నం అనే పాయింట్‌ను లీక్ చేశారు.

ఇక సారంగపాణి కాబోయే భార్య మైతిలిగా రూపా కొడవాయూర్ నటించారు. అయితే నిశ్చితార్థం తర్వాత పెళ్లి ఆగిపోయిన అనంతరం.. సారంగపాణితో మాట్లాడుతూ.. క్లీన్ స్టేట్‌లాగా నా వద్దకు వస్తే.. నా వేలికి ఈ ఉంగరం తొడిగించుకొంటాను అని ఎమోషనల్‌గా రూప చెప్పడం చెప్పడం చూస్తే.. ఏదో సమస్యలో ఆయన ఇరుక్కొన్నట్టు స్పష్టమైంది.

అలాగే ఈ కథలో సారంగపాణి స్నేహితులుగా హర్ష వైవా, వెన్నెల కిషోర్ కనిపించబోతున్నారు. అయితే ఈ గుంట కంత్రినా కైఫ్ అన్నమాట.. అంటూ ముగ్గురు చర్చించుకొంటూ కనిపిస్తారు. అయితే జ్యోతిష్యుడిని కలిసి పెళ్లి ఆపేద్దాం అంటూ చెప్పడం కనిపించింది. అయితే తన స్నేహితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్నేహితుడివా? స్లీపర్ సెల్ రూపంలో ఉన్న టెర్రరిస్టువా? అంటూ వెన్నెల కిషోర్ అనడం కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో అనేది స్పష్టమైంది.

ఇది కలకాదు.. పచ్చినిజం మూసుకొని ఎండబెట్టుకో. నేను సారంగపాణి బాబును పినాకపాణిని అంటే.. పినాకా పాణా? పింగాణి పాత్రనా? పిల్లల్ని ఇలానే పెంచేదా?, అన్నీ నువ్వే చేసుకోవడానికి హస్తప్రయోగమా? హత్య ప్రయత్నమా?, టచ్ చేశావురా? గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ కాని చోట టచ్ చేశావు అంటూ వినపడే డైలాగ్స్ ఇంద్రగంటి మార్కును చూపించింది.

నాన్ స్టాప్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకు ఎడిటర్‌గా మార్తాండ్ కే వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతను పీజీ విందా, వివేక్ సాగర్ మ్యూజిక్, లైన్ ప్రొడ్యూసర్‌గా విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి వ్యవహరించారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అనే క్యూరియాసిటీ అందరిలోను నెలకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X