రవితేజ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్: లోడింగ్ అవుతోందంటూ దర్శకుడి ట్వీట్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా కష్టనష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా మారాడు టాలెంటెడ్ గాయ్ రవితేజ. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న అతడు.. హీరోగా మారిన కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే, కొన్ని విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అన్నింటికీ మించి తనదైన సినిమాలతో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు దగ్గరై మాస్ మహారాజా అనే బిరుదును అందుకున్నాడు. ఆ తర్వాత కమర్షియల్ హీరోగా మారిపోయి స్టార్ స్టేటస్‌ను సైతం చూరగొన్నాడు. అప్పటి నుంచి రవితేజ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు.

చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. అయినప్పటికీ, ఆ మధ్య కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మొదట్లో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి విజయాల బాట పట్టాడు. ఇది అతడికి సక్సెస్‌ను అందించడమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపింది. దీంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే ఎదుర్కొంటోంది.

Sarath Clarity about Ramarao On Duty Teaser

గత ఏడాది రవితేజ ప్రారంభించిన చిత్రాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆరంభం నుంచే షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగిపోయింది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నుంచి అప్‌డేట్లు కావాలని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని నుంచి వాళ్లకు కిక్కిచ్చే వార్త ఒకటి వచ్చింది.

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ గురించి తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేశాడు. దీనిపై ఈ చిత్ర దర్శకుడు శరత్ మందవ స్పందించాడు. ఈ మేరకు ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. 'రామారావు ఆన్ డ్యూటీ మూవీ టీజర్ లోడ్ అవుతోంది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ సంస్థ విడుదల చేయబోతుంది' అని వెల్లడించాడు. దీంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. సోషల్ ఎలిమెంట్స్‌తో సందేశాత్మకంగా రాబోతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X