HBD Sharathkumar: OTTలోకి క్రేజీగా.. వెబ్ సిరీస్‌తో సుప్రీం స్టార్

కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమాల రిలీజ్, నిర్మాణంపై ఇంకా సందిగ్దత కొనసాగుతుండటంతో సినీ ప్రముఖుల దృష్టంతా ఇప్పుడు ఓటీటీల పడింది. ఒక్కొక్కరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను టార్గెట్ చేసుకొని వెబ్ సిరీస్‌పై దృష్టిపెట్టారు. ప్రస్తుతం ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూడా ఓటీటీలోకి ప్రవేశించారు. జూలై 15వ తేదీన తన 66వ జన్మదినోత్సవం సందర్భంగా శరత్ కుమార్ తన తొలి వెబ్ సిరీస్‌ బర్డ్స్ ఆఫ్ ప్రే: ది హంట్ బిగిన్స్ మూవీకి సంబంధించిన పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు.

బర్డ్స్ ఆఫ్ ప్రే: ది హంట్ బిగిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లను తన కుమార్తె, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ చేతుల మీదుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శరత్ కుమార్ లెదర్ జాకెట్ ధరించి చేతిలో తుపాకి పట్టుకొని మాస్ లుక్స్‌తో ఆకట్టుకొన్నారు. ఈ సందర్భంగా రాధిక ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఓటీటీలోకి శరత్ కుమార్‌కు స్వాగతం పలికేందుకు ఇంతకంటే శుభదినం మరోటి ఉంటుందా?.. హ్యాపీ బర్త్ డే శరత్ అంటూ ట్వీట్ చేశారు.

Sarathkumar entry into OTT with Birds of Prey: The Hunt Begins

తన తండ్రి శరత్ కుమార్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ప్రవేశించడంపై వరలక్ష్మీ శరత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకూ సుప్రీ స్టార్ ఓటీటీలోకి ప్రవేశించారు. వా హూ.. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్ డే నాన్నగారు అంటూ ట్వీట్ చేశారు.

Sarathkumar entry into OTT with Birds of Prey: The Hunt Begins

చిన్నారులపై లైంగిక వేధింపుల కథాంశంతో రూపొందిన సైకాలజికల్ థ్రిల్లర్ బర్డ్స్ ఆఫ్ ప్రే: ది హంట్ బిగిన్స్. అర్చనా శరత్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించున్నట్టు యూనిట్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X