twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK108: బాలయ్య సినిమాలో మరో స్టార్.. లీక్ చేసి సర్‌ప్రైజ్ చేసిన డైరెక్టర్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. గత ఏడాది విడుదలైన 'అఖండ' వంటి సూపర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడు పెంచారు. ఇందులో భాగంగానే ఇప్పుడు గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది.

    <strong>Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్‌, శ్రీహాన్‌కు షాక్</strong>Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్‌, శ్రీహాన్‌కు షాక్

    'వీరసింహారెడ్డి' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక, ఇప్పుడు డైరెక్టర్ అనిల్ ఈ మూవీ కాస్టింగ్‌పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే పలు పాత్రలకు సంబంధించి కొందరిని ఆయన ఎంపిక చేసుకున్నాడట. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.

    Sarathkumar Key Role in Balakrishna and Anil Ravipudi Movie

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు, 'బాలకృష్ణ 108వ మూవీలో గొప్ప నటుడు శరత్‌కుమార్ సార్‌తో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. అయితే, ఇందులో ఆయన ఎలాంటి పాత్రను చేస్తున్నారు అనేది మాత్రం రివీల్ చేయలేదు. మొత్తానికి శరత్‌కుమార్ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌నే చేస్తున్నట్లు తెలుస్తోంది.

    డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!

    ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా.. శ్రీలీలా ఆయన కూతురిగా నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

    English summary
    Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Sarathkumar to play Key Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X