సరిలేరు నీకెవ్వరు: సినీ క్రిటిక్ రివ్యూ.. బొమ్మ దద్దరిల్లిపాయిందా? ఒకే ఒక్క మాటలో చెప్పేశాడు
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ భారీ అంచనాల నడుమ ఈ రోజే (జనవరి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా రెగ్యులర్ షోస్ పడకముందే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. మరోవైపు ఆంధ్రాలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక ఆటలు వేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ శివసత్యం ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపాడు.

థియేటర్స్ అన్నీ అర్థరాత్రి నుంచే.. అభిమానుల కోలాహలం
గత అర్థరాత్రి నుంచే థియేటర్లన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ అర్థరాత్రి వేళ ఈలలు, గోళాలతో హోరెత్తిపోయాయి. నేటి రెగ్యులర్ షోస్ కోసం టికెట్స్ తీసుకుందామని పలుచోట్ల అర్థరాత్రి నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు మహేష్ అభిమానులు. మొత్తానికి అన్ని థియేటర్స్ లో అభిమానుల కోలాహలం కనిపించింది.

బొమ్మ పడింది.. టాక్ బయటకొచ్చింది
ప్రీమియర్స్ రూపంలో సరిలేరు నీకెవ్వరు బొమ్మ పడింది. ఎంతో ఆతృతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకలోకం ఫిదా అయ్యామని అంటోంది. మహేష్ యాక్షన్, కామెడీ టైమింగ్ అదిరింది వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ సినిమా చూసిన బాలీవుడ్ క్రిటిక్ శివసత్యం తన రేటింగ్ ఇస్తూ బొమ్మ ఎలావుందో ఒక్కమాటలో చెప్పేశాడు.

మార్వలస్.. ఇటీవలి కాలంలో మహేష్
సరిలేరు నీకెవ్వరు మూవీ ''మార్వలస్'' అని సింగల్ స్టేట్‌మెంట్ ఇచ్చి మహేష్ అభిమానులను ఖుషీ చేశాడు శివసత్యం. ఈ మేరకు.. ఇటీవల కాలంలో మహేష్ నటించిన బెస్ట్ మూవీ ఇదే అని కూడా తెలిపాడు. ఇది కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ అని ఆయన పేర్కొన్నాడు.
చిత్రంలోని నటీనటులు, విజువల్స్..
ఈ చిత్రంలోని ప్రతీ అంశం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు చిత్రంలోని నటీనటులు, విజువల్స్, ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ స్క్రోర్, కథ, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నింటిపై తన స్పందన తెలియజేస్తూ రేటింగ్ ఇచ్చాడు. మొత్తంగా తాను 3.5 రేటింగ్ ఇస్తున్నానని ట్వీట్ పెట్టాడు.
మహేష్ అభిమానుల ఫీలింగ్స్
సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ ద్వారానే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మహేష్ అభిమానులను ఖుషీ చేస్తోంది. తన హీరో ముందు చెప్పినట్లుగానే బొమ్మ దద్దరిల్లిపోయింది అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అన్ని ఏరియాల్లో సరిలేరు నీకెవ్వరుకు ఉన్న డిమాండ్ వారిని ఆనందపరుస్తోంది.
Recommended Video

సరిలేరు నీకెవ్వరు.. విజయశాంతి, బండ్ల గణేష్
దిల్ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన సరిలేరు నీకెవ్వరు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











