సరిలేరు నీకెవ్వరు: వీడియో క్లిప్.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అక్కడ.. మీకు అర్థమవుతోందా!!

మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్స్ చూసిన జనం పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో థియేటర్స్ అన్నీ అభిమానుల కోలాహలంతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమాతో కొత్త సంవత్సరానికి మహేష్ కిక్ స్టార్ట్ ఇచ్చేశారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై సినీ వర్గాలు స్పందిస్తూ సోషల్ మీడియాలో మెసేజీలు పోస్ట్ చేస్తున్నారు.

మహేష్ గత సినిమాలు, ఈ సినిమా.. తేడా ఇదే!

మహేష్ గత సినిమాలు, ఈ సినిమా.. తేడా ఇదే!

''శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి'' లాంటి చిత్రాలతో వరుసపెట్టి సందేశాత్మక కథలు చేసిన మహేష్ బాబు ఈ సారి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఫ్యాన్స్‌ ముందుంచారు. పైగా ఆరంభమే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఈ సినిమాపై పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.

అభిమానుల అంచనాలు.. తాజా పరిస్థితి

అభిమానుల అంచనాలు.. తాజా పరిస్థితి

భారీ అంచనాల నడుమ మహేష్ 26వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' విడుదలైంది. మహేష్ బాబు స్టైల్ ఆఫ్ కామెడీతో పాటు యాక్షన్ సీక్వెన్స్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు అనిల్ రావిపూడి. మహేష్ అభిమానులు ఏదైతే కోరుకున్నారో అది ప్రేక్షకుల ముందుంచారు. ఈ విషయం ట్రైలర్ ద్వారానే తెలియడంతో సినిమాపై భారీ డిమాండ్ నెలకొంది.

నేడే విడుదల.. సంక్రాంతి సందడి

నేడే విడుదల.. సంక్రాంతి సందడి


'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ రోజే (జనవరి 11) విడుదలైంది. మూడు రోజుల ముందుగానే ప్రేక్షకులకు సంక్రాంతి సంబరాలు తెచ్చిపెట్టారు మహేష్ బాబు.
ఇప్పటివరకు వచ్చిన టాక్, అందిన రిపోర్ట్స్ ప్రకారం.. దేశవిదేశాల్లో ఈ సినిమా సక్సెస్ అనిపించుకుంది. మహేష్ సంక్రాంతి సందడి మొదలైందని టాక్ నడుస్తోంది.

బొమ్మ బ్లాక్‌బస్టర్ అక్కడ.. మీకు అర్ధమవుతుందా..

బొమ్మ బ్లాక్‌బస్టర్ అక్కడ.. మీకు అర్ధమవుతుందా..

ఈ నేపథ్యంలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోషన్ సంస్థ శ్రేయాన్ మీడియా ''బొమ్మ బ్లాక్‌బస్టర్ అక్కడ.. మీకు అర్ధమవుతుందా'' అంటూ కాస్త వెరైటీగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన మహేష్ అభిమానులు 'మాకే కాదు అందరికీ అర్థమవుతోంది.. బొమ్మ బ్లాక్‌బస్టర్' అంటూ రియాక్ట్ అవుతున్నారు.

రష్మిక ముద్దు ముద్దు మాటలు.. వీడియో క్లిప్

రష్మిక ముద్దు ముద్దు మాటలు.. వీడియో క్లిప్

బొమ్మ బ్లాక్‌బస్టర్ అక్కడ.. మీకు అర్ధమవుతుందా!! అంటూ శ్రేయాన్ మీడియా చేసిన ట్వీట్‌కి రష్మిక మందన్న వీడియో క్లిప్ ట్యాగ్ చేశారు. ఇందులో ''మీకు అర్ధమవుతుందా!!'' అంటూ రష్మిక ముద్దు ముద్దు మాటలు మాంచి జోష్ ఇస్తున్నాయి. దీంతో క్షణాల్లో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

Recommended Video

Sarileru Neekevvaru Movie Twitter Review

మహేష్- రష్మిక లవ్ ట్రాక్

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ జోడీగా నటించింది రష్మిక మందన్న. చిత్రంలో ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఫర్వాలేదని అంటున్నారు జనం. అలాగే కేవలం మహేశ్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా మెచ్చుకుంటూ రియాక్ట్ అవుతున్నాడు. ఫస్టాఫ్ కామెడీ బాగుందని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X