సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ రివ్యూ: రిలీజ్‌కు ముందే షాకింగ్ రిపోర్ట్
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ అంచనాలతో సిద్ధమైంది. మహేష్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనే విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో సినీ విమర్శకుడు షాకింగ్ రివ్యూను పోస్టు చేశారు. సోషల్ మీడియాలో సదరు క్రిటిక్ వెల్లడించిన రివ్యూ ఇదే.

మార్వలెస్ అంటూ
ఇటీవల కాలంలో శివ సత్యం అనే సినీ విమర్శకుడు తనదైన శైలిలో పలు సినిమాలపై తమ అభిప్రాయాన్ని రిలీజ్‌కు ముందే వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాను వన్ వర్గ్ రివ్యూ పేరుతో సరిలేరు నీకెవ్వరూ మార్వలెస్ అంటూ సినిమా రేంజ్‌ను డిసైడ్ చేశారు.

కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ప్యాకేజ్
సరిలేరు నీకెవ్వరూ ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ప్యాకేజ్‌గా పేర్కొంటూ కామెంట్ చేశారు. ఎలాంటి సందేహం లేకుండా మహేష్‌కు సంబంధించి ఇటీవల కాలంలో బెస్ట్ మూవీ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అన్ని విషయాల్లో సక్సెస్‌ఫుల్. ప్రేక్షకుల్లారా.. డోంట్ మిస్ అంటూ నా రేటింగ్ 3.5/5 అని తన వన్ వర్డ్ రివ్యూలో పేర్కొన్నారు.

ఓవరాల్ రేటింగ్
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ ఫెర్ఫార్మెన్స్‌కు (4/5). వీఎఫ్‌ఎక్స్‌కు (4/5), యాక్షన్ (4/5),చ అనిల్ డైరెక్షన్‌కు (4/5)., ఎడిటింగ్‌కు (4/5)., స్క్రీన్ ప్లేకు (4/5), సినిమాటోగ్రఫికి (4/5), బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు (4/5), స్టోరీ (4/5), రష్మికకు (3/5), ప్రకాశ్ రాజ్ నటనకు (3/5) అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఓవరాల్‌గా సరిలేరు నీకెవ్వరూ రేటింగ్ (3.5/5) అని చెప్పారు.

ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ హంగామా
ఇక అమెరికాలో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీమియర్స్ ప్రారంభానికి కంటే ముందే భారీ వసూళ్లు నమోదయ్యాయి. అడ్యాన్స్ బుకింగ్ రూపంలో రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నది. భారత కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం.. యూఎస్‌లో 240 లొకేషన్లలో $428,473 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Recommended Video
దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్
సినిమా రిలీజ్‌కు ముందు దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి అమేజింగ్ మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్. థియేటర్‌లో ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది అంటూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











