twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సరిలేరు నీకెవ్వరు' అప్‌డేట్.. మహేష్ బాబు ఫొటో షేర్ చేసిన డైరెక్టర్

    |

    భరత్ అనే నేను, మహర్షి మహేష్ బాబు కెరీర్‌లో హాట్రిక్ మూవీగా రాబోతోంది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో సక్సెస్ ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రంలో క్యారెక్టర్ పేరును కన్ఫర్మ్ చేస్తూ ఫోటో షేర్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

    మహేష్ కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. గతంలో చూడని డిఫెరెంట్ లుక్‌లో ఆయన కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న మహేష్ క్యారెక్టర్ పేరు 'అజయ్ కృష్ణ' అని తెలుపుతూ పిక్ రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి. ఆర్మీ డ్రెస్ లో ఉన్న మహేష్ బాబుకు బ్యాడ్జ్ చూపుతూ ఆయన క్యారెక్టర్ పేరు రివీల్ చేశాడు. కశ్మీర్‌లో 'సరిలేరు నీకెవ్వరు' ఆపరేషన్ స్టార్ట్ చేశామని, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని ఈ సందర్బంగా అనిల్ రావిపూడి తెలిపారు.

     SariLeru Neekevvaru Intresting Update By Director

    అనిల్ రావిపూడి స్టైల్‌లోనే తన రెగ్యులర్ పంథాలో 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా కామెడీ పార్ట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ సినిమాలో కశ్మీర్ టు ఆంధ్ర ట్రైన్ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇక మహేష్, రష్మిక మందన్న రొమాన్స్‌కి ప్రియారిటీ ఇస్తూ కొన్ని సన్నివేశాలు హాయ్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం. మరోవైపు ఈ సినిమా ద్వారానే దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానుంది.

    English summary
    After Maharshi movie Mahesh Babu commited with mahesh 26 movie which is directed by Anil Ravipudi. This movie shooting is going on in Kashmir. Now Director reveals the charecter name of Mahesh Babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X