మహేష్ బాబు మండే ట్రీట్.. సరికొత్త ప్లాన్ రచించిన 'సరిలేరు నీకెవ్వరు' టీమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి దూకుడు మీదున్నాడు. ఇటీవలే మహర్షి రూపంలో తన సిల్వర్ జూబ్లీ సినిమాతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్.
ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన ఈ టీమ్.. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చేసింది. ఆపై పలు పోస్టర్స్ ద్వారా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు జనం. ఈ తరుణంలో ఇకపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుస అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకలోకాన్ని మిస్మరైజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.

ఈ మేరకు సరికొత్త ప్లాన్ రచించిన దర్శకనిర్మాతలు.. మాస్ మహేష్ బాబు మండేస్ పేరుతో ఇకపై వారానికి ఒకటి చొప్పున ప్రతి సోమవారం అప్డేట్ ఇచ్చేలా డిసైడ్ అయ్యారు. ఈ అప్‌డేట్స్‌లో పాటలు, కౌంట్‌డౌన్ పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్, ట్రైలర్ అన్నీ ఉంటాయట. అంటే ఇకపై సంక్రాంతి వచ్చేదాకా ప్రతి సోమవారం మహేష్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.
అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











