twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సరిలేరు నీకెవ్వరు: ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ పాత్ర నిడివి అంతేనా?

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. మహేష్ బాబు తొలిసారిగా ఈ చిత్రంలో ఆర్మీఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపులో చిత్రీకరించారు.

    అయితే ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు కనిపించేది సినిమా మొత్తం కాదని, కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమా మొదటి భాగంలో వస్తుందని, ఆ తర్వాత అసలు సినిమా కథలోకి ఎంటరవుతుందని టాక్.

    Sarileru Neekevvaru: Mahesh Babu army officer role duration revealed

    కశ్మీర్ షెడ్యూల్ ముగియడంతో నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఇందులో విజయశాంతితో పాటు ప్రధాన తారాగణం నటిస్తున్నారు. విజయశాంతి సెట్లోకి ఎంటరైన సందర్భంగా అనిల్ రావిపూడి ఆమె లుక్ రివీల్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. హీరో ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి కనిపిస్తుందని, ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

    అనిల్ రావిపూడి అంటేనే కామెడీకి పెట్టింది పేరు. 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో కూడా ఆయన తనదైన శైలిలో కామెడీ పండించబోతున్నారని, ఆర్మీ బ్యాక్ డ్రాపులో వచ్చే కథ ఎంత సీరియస్‌గా ఉంటుందో, కామెడీ, ఎమెషన్స్ కూడా అదే స్థాయిలో పండించబోతున్నట్లు టాక్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిల్ రాజు, మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

    రష్మిక మందన్న ఈ చిత్రం ద్వారా తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పని చేసే అవకాశం దక్కించుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Mahesh Babu will be playing the role of Army Officer in Sarileru Neekevvaru movie. It appears that his role as an Army officer comes in the first half and will last 25 minutes. The film is slated to hit screens for Sankranthi, 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X