రష్మికపై మహేష్ కౌంటర్స్.. ఆమె చిన్నపిల్లేం కాదు అంటూ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జోడీగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో నిలిచి సూపర్ సక్సెస్ సాధించింది. జనవరి 11న విడుదలై అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నను ఆటపట్టించారు మహేష్ బాబు.
విజయశాంతి మాట్లాడుతూ రష్మిక చిన్న పిల్ల అని చెప్పగానే వెంటనే అందుకున్న మహేష్ బాబు.. ''రష్మిక చిన్నపిల్లేం కాదు, హీరోయిన్ అయ్యింది. చిన్నపిల్ల అంటే మా సితార పాప'' అన్నారు. దీంతో రష్మిక సహా అక్కడున్న యూనిట్ సభ్యులందరూ తెగ నవ్వేశారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.


Click it and Unblock the Notifications











