రికార్డులు క్రియేట్ చేయడంలోనూ మహేష్‌కు ‘సరిలేరు’

మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటుకోగా.. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. ఎవ్వరికీ సొంతం కాని రికార్డులను క్రియేట్ చేస్తూ.. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ఈ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లో వైరల్ అయ్యి రియల్ టైం వ్యూస్, లైక్ ల విషయంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. 40 గంటల్లోనే 20 మిలియన్ రియ‌ల్‌టైమ్ వ్యూస్ సాధించి 40 గంట‌ల పాటు కంటిన్యూగా యుట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉండ‌డం విశేషం.

Sarileru Neekevvaru Movie Teaser Crossed 20 Millions Views In 40 Hours

ఈ టీజర్‌తో సినిమాపై అటు ప్రేక్ష‌కుల‌లో, ఇటు మ‌హేష్ అభిమానుల‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X