twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స‌రిలేరు నీకెవ్వ‌రు: సూప‌ర్‌స్టార్ మహేష్ మరో రికార్డ్.. విడుదలకు ముందే ఇలా ఉందంటే..

    |

    సినిమాల పరంగా టాలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు హవా నడుస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ మంచి ట్రాక్ రికార్డ్ మెయిన్‌టైన్ చేస్తున్నారు మహేష్. ఇటీవలే తన 25వ సినిమా 'మహర్షి'తో సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు 26వ సినిమాతో విడుదలకు ముందే 'స‌రిలేరు నీకెవ్వ‌రు' అనిపించుకుంటున్నారు.

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్ సృష్టించిన హంగామా కారణంగా లక్షలాది మంది ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ డిమాండ్ మేరకు 'స‌రిలేరు నీకెవ్వ‌రు' థియేటర్స్ సంఖ్య కూడా పెంచేశారు.

    SariLeru Neekevvaru: New Record For Tollywood

    ఈ నేపథ్యంలోనే కేరళ రాష్ట్రంలో ఈ సినిమాను 30 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నార‌ట‌. అంటే 'స‌రిలేరు నీకెవ్వ‌రు' రూపంలో కేర‌ళలో కొత్త రికార్డును క్రియేట్ కానుందన్నమాట. అక్కడ ఓ తెలుగు సినిమా ఇన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌డం ఇదే ప్ర‌థ‌మం అని తెలుస్తోంది.

    దిల్‌ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు.

    English summary
    Mahesh Babu doing his next project with Anil Ravipudi. For this movie once again selected music director as Devi Sri Prasad. This movie creates new record now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X