Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్, అల్లు అర్జున్ ఫైట్ లేనట్టే.. రాజీ చేసిన సినీ పెద్దలు.. సంక్రాంతికి ముందే పండుగ
తెలుగు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎంత మంది హీరోలు తలపడినా సరే సంక్రాంతి పుంజుల్లా పోటీ కూడా మజానే ఇస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఎన్నడూ లేని సందిగ్దత ఏర్పడింది. గత ఏడాదికి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదు.కానీ, ఈ సారి మాత్రం విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది. సంక్రాంతి దగ్గరపడుతున్న సినిమా రిలీజ్ డేట్లను మాత్రం ప్రకటించడం లేదు. ఈ వ్యవహారాన్ని ఇరు చిత్రాల నిర్మాతలు దగ్గరుండి చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు.

అయోమయంలో ఫ్యాన్స్..
మహేష్ బాబు నటించిన సరిలేరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో రెండూ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం, రెంటికి కూడా భారీ హైప్ క్రియేట్ కావడం సంక్రాంతి పోటీని మరింత రంజుగా తయారు చేసింది. అయితే విడుదల జాప్యమవుతుండటంతో ఆ మజా పోతూ వచ్చింది. బుకింగ్స్ ఓపెన్ కాక, ప్రీమియర్ షో సంగతి తేలక అభిమానులు అయోమయంలో పడ్డారు.

పోస్టర్లతో అనుమానం..
మొదటగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో రాబోతోన్నట్లు ప్రకటించారు. దాదాపు ఇదే ఫిక్స్ అని కొన్ని నెలల పాటు అధికారిక పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తేదీల్లో మార్పులు రాబోతోన్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాము రిలీజ్ చేసే పోస్టర్లలో డేట్స్ ప్రకటించకుండా సంక్రాంతికి రాబోతోన్నట్లు మాత్రమే వేశారు. అయితే ఆ పోస్టర్లతో ఫ్యాన్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి.

నిర్మాతల మధ్య చర్చలు
అయితే వీటీపై దిల్ రాజు, అల్లు అరవింద్‌లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతూ వచ్చారు. అయితే ఆ సమస్య మాత్రం ఓ కొలిక్కి రాలేదు. రెండు కూడా పెద్ద బ్యానర్లే కావడం, పెద్ద హీరోలే కావడంతో రిలీజ్ డేట్ల మధ్య యుద్దం మొదలైంది. వీటిపై రెండు మూడు రోజులుగా చర్చలు జరుపుగా.. చివరకు వీటిపై ప్రొడ్యూసర్ గిల్డ్ జోక్యంతో ఓ కొలిక్కి వచ్చాయి.

ఎక్కడి చిత్రాలు అక్కడే..
ప్రొడ్యూసర్ గిల్డ్ సహాకారంతో ఎవరికీ నష్టం లేకుండా ముందు అనుకున్నట్లే సరిలేరు జనవరి 11న, అల వైకుంఠపురములో జనవరి 12న రాబోతోన్నాయని దిల్ రాజు ప్రకటించారు. మనస్పర్థల కారణంగానే ఈ సమస్య వచ్చిందని, అయినా వాటి గురించి ఎక్కువ ఆలోచించట్లేదు.. రెండు సినిమాలు ఒకే రోజు వేసుకుంటే రెవెన్యూ రాదని, అదే ఆలోచించామని అన్నారు. అందుకే ఒకే రోజు రాకుండా గిల్డ్ సహకారంతో ఓ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.