Sarileru Neekevvaru Pre Release Event : టైటిల్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను : కొరటాల శివ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

కొరటాల శివ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదే వేదికపై భరత్ అనే నేను ఈవెంట్ చేశాము. మళ్లీ ఇలా రావడం ఆనందంగా ఉంది. మెగాస్టార్‌ను ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. సరిలేరు టైటిల్ పెట్టినప్పుడు నేను ఎంతగానే హ్యాపీగా ఫీలయ్యాను. మహేష్‌కు సరిగ్గా సరిపోయే టైటిల్.

కమర్షియల్ సినిమాలను అనిల్ రావిపూడి అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. ఆయనలాంటి రైటింగ్‌కు మహేష్ లాంటి హీరో దొరికితే ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. ఈ ఇయర్ మీకు ఇంకా బాగుండాలి. నేను విజయశాంతి గారి అభిమానిని. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలు చూస్తూ పెరిగాను. మళ్లీ మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది. రాక్ స్టార్ గురించి చెప్పి చెప్పి బోర్ కొడుతుంది. మ్యూజిక్ ఎలా ఇచ్చాడో అర్థమవుతోంద'ని అన్నాడు.

Sarileru Neekevvaru Pre Release Event Koratala Siva And Vamsi Paidipally Speech

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. 'నేను డైరెక్టర్ అయ్యాను కాబట్టే ఇక్కడ ఉన్నాను..లేదంటే మీ మధ్య ఉండేవాడిని. మాకు సినిమా పిచ్చి పట్టిందంటేనే అది చిరంజీవి వల్ల. చిరంజీవిని, విజయశాంతిని ఇలా చూస్తుంటే.. గ్యాంగ్ లీడర్, అత్తకు యముడు, కొండవీటి దొంగ లాంటి ఎన్నో సినిమాలు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. జనవరి 11న తరువాత మీ ఫోన్ మోగుతూనే ఉండాల'ని కోరుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X