Sarileru Neekevvaru Pre Release Event : మీ హీరోను చాలా కష్టపెట్టాము.. రామ్ లక్ష్మణ్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

Sarileru Neekevvaru Pre Release Event Live Updates Ram Lakshman Speech

రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'ఆకాశంలో ఎన్నోస్టార్లు ఉంటాయి..మనకు తెలిసిన ఒకే ఒక్క స్టార్ మెగాస్టార్.. ఆయనకు నమస్కారం.. మీ హీరోను చాలా కష్టపెట్టాం.. కాశ్మీర్‌లో కొండలపైకి ఎక్కించాము..దూకించాము.. మీరు చూస్తారు.. అవి అద్భుతంగా వచ్చాయి.. సరిలేరు నీకెవ్వరు టైటిల్ ఆయనకు కరెక్ట్ టైటిల్.. వంద ఇంతలు కాదు..వెయ్యింతలు ఇష్టపడతారు.. మేము వద్దని చెప్పినా... గడ్డం పట్టుకుని అడుగుతారు... ఇంకా చేయాలా? అని అడుగుతారు.

ఆయన్ను చూస్తే మాకే భయమేస్తుంది.. అంత పర్ఫెక్షన్‌గా చేయాలేమోనని. అనిల్ రావిపూడి డైరెక్టర్ కాదు యాక్టర్. నవ్విస్తూ.. ఆడిస్తూ.. పాడిస్తూ.. అందరి నుంచి తనకు కావాల్సింది తీసుకుంటారు. మా నుంచి అద్భుతమైన ఫైట్స్ కూడా తీసుకున్నారని ఆశిస్తున్నాము. మదర్ లేడీ సూపర్ స్టార్‌కు థ్యాంక్స్.. ఆమె అలా బాబు చేయిపట్టుకుని పోతుంటే.. ఏదో పవర్ నడిచినట్టు కనిపిస్తుంద'ని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X