లాస్ట్ డికేడ్ దూకుడు.. ఈ డికేడ్ సరిలేరు నీకెవ్వరు శుభారంభం: శ్రీను వైట్ల
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.
అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది.

ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.
ఈ సందర్బంగా డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ''మెగాస్టార్ చిరంజీవి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, సూపర్ ఫ్యాన్స్ కి అందరికీ నమస్కారం. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అనిల్, రాజు గారు చేసిన ఈ సినిమా ఇంత పెద్ద ఫంక్షన్ జరుపుకోవడం. గొప్ప విషయం ఏంటంటే మెగాస్టార్, సూపర్ స్టార్ ఇద్దరు కలసి రావడం. థాంక్యూ చిరంజీవి గారు. అనిల్ నాకు రూమ్ మెట్. లాస్ట్ డికేడ్ దూకుడుతో శుభారంభం వచ్చింది. ఈ డికేడ్ సరిలేరు ద్వారా శుభారంభం రావాలని కోరుకుంటున్నా'' అన్నారు.


Click it and Unblock the Notifications











