మా కుటుంబం ఎప్పుడూ మీకు రుణపడి ఉంటుంది.. సుధీర్ బాబు హార్ట్ టచింగ్ స్పీచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.
అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది.

మెగా, సూపర్ స్టార్ అభిమానుల తాకిడి
ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.

ఆకాశంలో ఎన్నోస్టార్లు ఉన్నా మనకు తెలిసిన స్టార్లు
వేదికపై సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''హలో.. సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్.. మీరు అలా అరుస్తుంటే కమ్మగా హాయిగా ఉంది. ఆకాశంలో ఎన్నోస్టార్లు ఉన్నా మనకు తెలిసిన స్టార్లు మాత్రం చిరంజీవి, మహేష్ బాబు, విజయశాంతి'' అని చెప్పాడు.
నాకు నిలువెత్తు నిదర్శనం చిరంజీవి
ఎప్పుడైనా కృష్ణ గారు, మహేష్ హార్డ్ వర్క్ గురించి చెబుతుంటే నాకు నిలువెత్తు నిదర్శనం చిరంజీవి కనిపిస్తున్నారు. నాకే కాదు ఇక్కడున్న చాలామందికి మెగాస్టార్ ఓ రోల్ మోడల్. అనిల్ సుంకర, దిల్ రాజు గారు.. ఏంటన్నా మహేష్ తప్ప వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వరా మీరు. ఈ ప్రమోషన్స్ చూస్తుంటే మీరు ఎంత ఇష్టపడి ఈ సినిమాలు చేస్తున్నారో తెలుస్తోంది అని సుధీర్ బాబు అన్నాడు.

అనిల్ రావిపూడి లైఫ్ లో బిగ్గెస్ట్ మంత్
అనిల్ రావిపూడి మరియు మహేష్ బాబు కలిసి ఈ సినిమాను చేయడం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. ఎక్సయిట్‌తో పాటు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని స్ట్రెస్ కూడా ఉంది. అనిల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. ఈ నెల మీ లైఫ్ లో బిగ్గెస్ట్ మంత్. కంగ్రాట్స్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నాడు సుధీర్ బాబు . మా కుటుంబం ఎప్పుడూ మీకు రుణపడి ఉంటుందని ఈ సందర్బంగా సుధీర్ బాబు తెలిపాడు.


Click it and Unblock the Notifications











