SariLeru Neekevvaru: మహేష్ బాబు వైరల్ పిక్.. 16 ఏళ్ల తర్వాత అంటూ డైరెక్టర్ కామెంట్
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతోంది 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుళ్తున్న తీరు మహేష్ అభిమానుల్లో సరికొత్త ఆత్రుత నింపుతోంది. మహేష్ 25వ సినిమా 'మహర్షి'ని బీట్ చేసేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేపడుతున్నారు.

కొండారెడ్డి బురుజు.. 4 కోట్ల రూపాయలు
సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో భాగంగా.. కర్నూల్ లోని కొండారెడ్డి బురుజులో చేయాల్సిన కొన్ని సన్నివేశాల కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యకంగా సెట్ వేశారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఈ సెట్‌లో మహేష్ బాబుతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఆ భారీ సెట్ ఎదుట మహేష్ నిల్చున్న పిక్ నెట్టింట దర్శనమీయడంతో అది వైరల్ అయింది.
16 ఏళ్ల తర్వాత అంటూ డైరెక్టర్ ట్వీట్
కొండారెడ్డి బురుజు మహేష్ నిల్చున్న ఈ పిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు ''16 సంవత్సరాల క్రితం ఈ లొకేషన్ వెండితెరపై ఐకానిక్‌గా మారింది. మళ్ళీ ఇప్పుడు అదే లొకేషన్ తో మీ ముందుకు రాబోతున్నాం. కాకపోతే ఈ సారి మరింత అద్భుతం సృష్టించనున్నాం. A.S ప్రకాష్ గారు ఈ లొకేషన్‌ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు'' అని ట్వీట్ పెట్టారు.

పోరాట ఘట్టాల షూటింగ్
సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో భాగంగా సినిమాలోని కొన్ని పోరాట ఘట్టాల షూటింగ్ కొండారెడ్డి బురుజు వద్ద చేస్తున్నారని సమాచారం. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మహేష్ బాబుతో పాటు కొంతమంది ఫైటర్లపై ఈ పోరాట ఘట్టాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

విజయశాంతి ఎంటర్
ఇక దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే రీ రెంటరీ ఇస్తున్న విజయశాంతి కూడా ఈ సెట్స్‌పై అడుగుపెట్టిందని తెలుస్తోంది. చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆమెపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. మరికొద్ది రోజుల్లోనే సరిలేరు నీకెవ్వరు మేజర్ సన్నివేశాల షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్‌లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











