రికార్డులు సృష్టించడంలోనూ బేరాల్లేవు.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సరిలేరు టీజర్

మహేష్ బాబు స్టామినా ఏంటో సోషల్ మీడియాకు తెలిసి వచ్చింది. సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ అయి నిమిషాలు కూడా దాటలేదు కానీ రికార్డులు మాత్రం సరిహద్దులు దాటుతున్నాయి. మహేష్ బాబు పవర్ ఏంటన్నది సోషల్ మీడియా మరోసారి రుచిచూసింది. సరిలేరు నీకెవ్వరు టీజర్‌లో మహేష్ విశ్వరూపాన్ని చూపించాడు. డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్, భాష, యాస ఇలా ప్రతీ ఒక్కదాంట్లో వేరియేషన్ చూపించి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు.

పోస్టర్లతో నానా హంగామా..

పోస్టర్లతో నానా హంగామా..

ఎఫ్‌2 లాంటి సినిమాతో భారీ హిట్ కొట్టిన దర్శకుడు తమ సూపర్ స్టార్‌ను ఎలా చూపిస్తారన్న అనుమానం కలిగేది. అయితే ఎప్పుడైతే పోస్టర్లు విడుదల చేయడం ప్రారంభించారో.. సినిమాపై క్రమక్రమంగా అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. రీసెంట్‌గా ఈ పోస్టర్ల దాడి మరీ ఎక్కువైంది. ఇక ఫ్యాన్స్‌ను పిచ్చెక్కించేందుకు టీజర్ వచ్చేసింది.

నిజంగానే సరిలేరు..

నిజంగానే సరిలేరు..

మహేష్ చెప్పిన ప్రతీ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసేలా ఉంది. మహేష్ చూపులు కత్తి కంటే పదునుగా ఉన్నట్టున్నాయి. ఇక ప్రకాశ్ రాజ్‌కు మహేష్ తడిసిపోయేలా చేసినట్టు కనిపిస్తోంది. వణకుతున్న అజయ్‌ను చూస్తుంటే.. మహేష్ ఏ రేంజ్‌లో ఆడేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

 ప్రతీ డైలాగ్ హైలెట్ ..

ప్రతీ డైలాగ్ హైలెట్ ..

మహేష్ చెప్పిన డైలాగ్స్ మాత్రమే కాకుండా విజయశాంతి చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సైతం అందర్నీ ఆకట్టుకుంది. ఇక చివరగా ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ చూస్తుంటే మహేష్ ఏ రేంజ్‌లో టార్చర్ పెట్టాడో అర్థమవుతోంది.

రికార్డులు సృష్టించడంలోనూ బేరాల్లేవు..

రికార్డులు సృష్టించడంలోనూ బేరాల్లేవు..

టీజర్ రిలీజైన తొమ్మిది నిమిషాల్లోనే వన్ మిలియన్ రియల్ టైమ్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఫాస్టెస్ట్ 100కె లైక్ట్ టీజర్‌గా మరో కొత్త సంచలనం సృష్టించేసింది. ఇలా మహేష్ రికార్డులు సృష్టించడంలోనూ బేరాల్లేవు అని పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది.

Recommended Video

Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
మోతమోగిస్తున్న సరిలేరు..

మోతమోగిస్తున్న సరిలేరు..


ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సాహో టీజర్‌కు 23 నిమిషాల్లో, భరత్ అనే నేను టీజర్ 29 నిమిషాల్లో, అరవింద సమేత టీజర్‌కు 30 నిమిషాల్లో లక్ష లైకులు రాగా.. సరిలేరు నీకెవ్వరు టీజర్‌కు 18 నిమిషాల్లో లక్ష లైకులు సాధించి.. రికార్డుల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X