దుమ్ము దులుపుతున్న 'సరిలేరు నీకెవ్వరు'.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరినీ వెనక్కి నెట్టేస్తూ
సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. వరుస విజయాలతో సూపర్ జోష్‌లో ఉన్న మహేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. కలర్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు తెర లేపుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ సరిలేరు మహేష్‌కి ఎవ్వరూ అనిపిస్తోంది.

అలా మొదలైన ప్రయాణం.. రోజు రోజుకూ
ఇంత వరకు అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా పేరున్న డైరెక్టర్ అనిల్ ఆవిపూడి అనతి కాలంలోనే మహేష్‌తో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు. దీంతో టైటిల్ మొదలుకొని అన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తున్నాడు అనిల్. ఈ నేపథ్యంలోనే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ మహేష్ బాబుకు సరిగ్గా యాప్ట్ అయ్యే టైటిల్ ఫిక్స్ చేశాడు అనిల్.

ఆసక్తికర అప్‌డేట్స్.. టీజర్ హంగామా
ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్స్ ఇచ్చి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపిన అనిల్ రావిపూడి తాజాగా టీజర్ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ క్షణాల్లో వైరల్ అయి పలు రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ఆన్ లైన్ వేదికలపై ఈ టీజర్ హంగామా తప్ప మరేదీ కనిపించడం లేదు.

అత్యంత త్వరగా 50 వేలు
'సరిలేరు నీకెవ్వరు' టీజర్ విడుదలైన 7 నిమిషాల్లోనే అరుదైన ఫీట్ సాధించింది. టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఏ సినిమాకు రాని విధంగా కేవలం 7 నిమిషాల్లోనే 50 వేల లైకులు సంపాదించింది 'సరిలేరు నీకెవ్వరు'. గతంలో అరవింద సమేత 10 నిమిషాలు, సాహో 11 నిమిషాలు, అజ్ఞాతవాసి 12 నిమిషాలు, మహర్షి 13 నిమిషాల్లో ఈ ఫీట్ సాధించాయి.

లక్ష విషయంలోనూ 'సరిలేరు నీకెవ్వరు' మహేష్
ఇక లక్ష లైకుల విషయంలోనూ సరిలేరు తనకెవ్వరూ అనిపించుకున్నారు మహేష్. కేవలం 18 నిమిషాల్లోనే 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లక్ష లైకులు సంపాదించింది. గతంలో సాహో 23 నిమిషాలు, భరత్ అనే నేను 29 నిమిషాలు, అజ్ఞాతవాసి 30 నిమిషాలు, అరవింద సమేత 30 నిమిషాల్లో ఈ ఫీట్ సాధించాయి.

2 లక్షలపై మహేష్ దూకుడు.. దుమ్మెలేపే ఫీట్
50 వేలు, లక్ష ఏంటి.. 2 లక్షల లైకులపై కూడా మహేష్ దూకుడుగా అడుగేశారు. కేవలం 64 నిమిషాల్లోనే 2 లక్షల లైక్స్ రాబట్టి మరో అరుదైన ఫీట్ సాధించింది సరిలేరు నీకెవ్వరు టీజర్. గతంలో ఇదే ఫీట్‌ని అజ్ఞాతవాసి 81 నిమిషాలు, సాహో 82 నిమిషాలు, సైరా 155 నిమిషాలు, అరవింద సమేత 160 నిమిషాల్లో సాధించాయి.
సరిలేరు నీకెవ్వరు.. అభిమానుల్లో ఆత్రుత
సరిలేరు నీకెవ్వరు సినిమాతోనే లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం అభిమానుల్లో మరింత ఆత్రుత నింపింది. దేవి శ్రీ బాణీలు కడుతున్న ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











