మహేష్ బాబు బర్త్ డే స్పెషల్: ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో సూపర్బ్
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సరలేరు నీకెవ్వరు'. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఇంట్రో విడుదల చేసింది. మహేష్ బాబు పూర్తి లుక్ రివీల్ చేస్తూ రిలీజైన ఈ వీడియో ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు... మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు. కెరీర్లో తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్‌గా పాత్ర పోషిస్తున్నారు. గతంలో పోలీస్ పాత్రల్లో అదరగొట్టిన సూపర్ స్టార్... ఈ సారి సైనికుడిగా ప్రేక్షకులను అలరించబోతున్నారు.
సరిలేరు నీకెవ్వరు... నువ్వెళ్లే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు... నువ్వెళ్లే రహదారికి జోహారు అంటూ సాగే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేసింది. F2 లాంటి విజయం తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఈ సినిమాపై మరింత నమ్మకంగా ఉన్నారు.

సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా
ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నుంచి వచ్చే సినిమాలన్నీ సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా ఉంటున్నాయి. ఈ చిత్రంలో కూడా అలాంటి పాయింటే ఉంటుందని, అనిల్ రావిపూడి సందేశాత్మకంగా, దేశ భక్తి మరింత పెంచేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న మూవీ
ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న మూవీ కావడంతో ఇది సీరియస్‌గా నడిచే సినిమా అని ముందుగా అంతా భావించారు. అయితే అనిల్ రావిపూడి సినిమాలో ఆ సీరియస్ నెస్ కంటిన్యూ చేస్తూనే తనదైన మార్క్ ఎంటర్టెన్మెంట్ ఇందులో జొప్పించినట్లు తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తోంది. చాలా కాలం తర్వాత విజయశాంతి ఈ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, నరేష్, రమ్యకృష్ణ, సంగీత, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











