సరిలేరు నీకెవ్వరు సర్‌ప్రైజ్.. లిరిక్స్ ముందే షేర్ చేసిన అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. గత మండే 'మైండ్ బ్లాక్' చేసిన ఆయన ఈ మండే.. మరో సర్‌ప్రైజ్ సిద్ధం చేశారు. ''సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో'' అంటూ సాగిపోయే పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజే (డిసెంబర్ 9) ఈ పాట విడుదల కానుంది.
అయితే పాట విడుదలకు కొన్ని గంటల ముందే ఈ సాంగ్ లిరిక్స్ షేర్ చేస్తూ రామజోగయ్య శాస్త్రికి కృతజ్ఞతలు చెప్పారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దేవీ శ్రీ ప్రసాద్ బ్రిలియంట్ ట్యూన్ అందించారని అన్నారు.

ఈ మేరకు ''సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో.
విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో...
సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో..." అంటూ పాటలోని లిరిక్స్ పంచుకున్నారు అనిల్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











