పండగ మూడు రోజుల ముందే వస్తోంది.. 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ కెరీర్‌లో 26వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. షూటింగ్ ప్రారంభం నుంచే సరికొత్తగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్న చిత్రయూనిట్ కొద్దిసేపటి క్రితం అదిరిపోయే న్యూస్ చెప్పింది. వివరాల్లోకి పోతే..

మహేష్ బాబుతో మజా.. తమన్నా హవా
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్‌గా హవా సాగిస్తూనే అడపాదడపా స్టార్ హీరోస్ మూవీస్‌లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ 'సరిలేరు నీకెవ్వరు' లో మహేష్ బాబుతో మజా చేసిందట. ఇప్పటికే విడుదలైన ఆమె ఐటెం సాంగ్ లుక్ ఆసక్తి రేపింది.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవలే.. ఐటెం సాంగ్ ప్రోమో
ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరిగినది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇందులో తమన్నా అందాలతో పాటు ఆమె చేసే డాన్స్ ఉర్రూతలూగించనుందని టాక్. అయితే ఆ సమయం వచ్చేసిందని, ఈ ఐటెం సాంగ్ ప్రోమో విడుదలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

పండగ మూడు రోజుల ముందే వస్తోంది.. కంప్లీట్ విజువల్ ట్రీట్
మహేష్ బాబు- తమన్నా లపై షూట్ చేసిన ఈ ఐటెం సాంగ్ ఈ రోజు (డిసెంబర్ 28) సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఈ సాంగ్ పోస్టర్ షేర్ చేసిన రామజోగయ్య శాస్త్రి.. ''పండగ మూడ్రోజులు ముందే వస్తాంది. పర్ఫెక్ట్ పెయిర్, పర్ఫెక్ట్ మూవ్స్, బ్లాస్ట్ మ్యూజిక్, కంప్లీట్ విజువల్ ట్రీట్'' అని పేర్కొన్నారు.
చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు..
ఇక 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. చిత్ర నిర్మాణంలో హీరో మహేష్ బాబు కూడా భాగమయ్యారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











