twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు.. ఎమోషనల్‌గా లేఖ రాసిన విజయశాంతి

    |

    మహర్షి భారీ విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. F2 లాంటి సక్సెస్‌ను అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది. దిల్ రాజు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటిలానే సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ దూరంగా ఉండగా, ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

    సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన ఇమేజ్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథను, టైటిల్‌ను పెట్టాం అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం తథ్యం. విజయశాంతి కీలక పాత్రలో కనిపిస్తారు అని అనిల్ రావిపూడి చెప్పారు.

    Sarileru Neekevvaru update: Mahesh babu as Army Major

    ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన విజయశాంతి ఓ లేఖను పంపారు. సూపర్‌స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. 160 చిత్రాల తర్వాత కొంత విరామం తీసుకొని మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను. 13 ఏళ్ల రాజకీయ జీవితం అనంతరం చేస్తున్న సినిమా ఇది. కృష్ణగారి కుమారుడు మహేష్ బాబుతో సినీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం హ్యాపీగా ఉంది అని విజయశాంతి లేఖ రాశారు. ఈ లేఖను దర్శకుడు అనిల్ రావిపూడి చదివి వినిపించారు. ఈ సినిమా సంక్రాంతి 2020కి రిలీజ్ అవుతుంది.

    English summary
    After Maharshi huge hit, Mahesh Babu's latest movie Sarileru Neekevvaru movie has been started. Rashmika Mandanna as lead heroine, Senior Actress Vijaya Shanti will be seen in key role which is directed by Anil Ravipudi. As per Anil, Mahesh babu will be seen as Army Major in this movie. The film has been scheduled to release around Sankranthi 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X