ఆ పని పూర్తిచేసిన మహేష్! ఇక సంక్రాంతి సందడే తరువాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుమీదున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్‌డేట్స్ ఇస్తూ సినిమా పట్ల మహేష్ అభిమానుల్లో ఉన్న ఆతృతను పెంచేస్తోంది చిత్రయూనిట్.
మండే సర్‌ప్రైజ్ పేరుతో గత కొన్నివారాలుగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ వస్తోంది 'సరిలేరు నీకెవ్వరు' యూనిట్. ఈ మేరకు విడుదలైన పాటలు అనుకున్న రేంజ్ కాకపోయినా పాజిటివ్ స్పందన తెచ్చుకున్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో మహేశ్ బాబు తన పాత్రకు సంబందించిన డబ్బింగ్ పూర్తి చేశారని తెలిసింది.

దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్ర పోషించింది. ఇక సంక్రాంతి సందడే తరువాయి అన్నట్లుగా జనవరి 11న రిలీజ్ కోసం రెడీ అయింది సరిలేరు నీకెవ్వరు మూవీ.
ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్, మహేష్ బాబు లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సంక్రాంతికి మహేష్ సందడి చూడటానికి ఆసక్తిగా ఉంది ప్రేక్షక లోకం.


Click it and Unblock the Notifications











