Mind Block Song: మహేష్ బాబు మండే సర్‌ప్రైజ్.. ఆగలేకపోతున్న ఫ్యాన్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అభినామానులు ఉర్రుతలూగేలా ఫస్ట్ మండే సర్‌ప్రైజ్ సిద్ధం చేశారు 'సరిలేరు నీకెవ్వరు' మేకర్స్. ఈ సర్‌ప్రైజ్ మహేష్ బాబు అభిమానులకు మైండ్ బ్లాక్ చేయనుందట. దీనికి ముహూర్తం ఈ రోజు (డిసెంబర్ 2) పెట్టేశారు. ఆ వివరాలు చూద్దామా..

మిస్మరైజ్ చేసేలా వరుస అప్‌డేట్స్
ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చేసింది. ఆపై పలు పోస్టర్స్ ద్వారా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు జనం. ఈ తరుణంలో ఇకపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుస అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకలోకాన్ని మిస్మరైజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.

సోమవారం స్పెషల్.. మహేష్ కిక్
ఈ మేరకు సరికొత్త ప్లాన్ రచించారు 'సరిలేరు నీకెవ్వరు' దర్శకనిర్మాతలు. మాస్ మహేష్ బాబు మండేస్ పేరుతో ఇకపై వారానికి ఒకటి చొప్పున ప్రతి సోమవారం అప్డేట్ ఇచ్చేలా డిసైడ్ అయ్యారు. ఈ అప్‌డేట్స్‌లో పాటలు, కౌంట్‌డౌన్ పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్, ట్రైలర్ అన్నీ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ మండే ముస్తాబయింది.

ఆగలేకపోతున్న ఫ్యాన్స్.. మైండ్ బ్లాక్
ఈ నేపథ్యంలో 'సరిలేరు నీకెవ్వరు' మొదటి పాట ''మైండ్ బ్లాక్''కి ముహూర్తం పెట్టేశారు. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ మహేష్ అభిమానులకు మైండ్ బ్లాక్ చేయడం ఖాయం అని తెలుస్తుండటంలో ఆయన ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు.
ఐదు సోమవారాలు.. ఐదు పాటలు
ఈ సోమవారం మొదలుకొని ఐదు సోమవారాల్లో ఐదు పాటలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు ఈ హంగామా కొనసాగనుంది. దీంతో నెల ముందుగానే మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగ వచ్చినట్లయింది.
Recommended Video

'సరిలేరు నీకెవ్వరు' మూవీ
అనిల్ సుంకర, దిల్ రాజులతో పాటు మహేష్ బాబు సంయుక్తంగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











