Nani 31: టాలెంటెడ్ డైరెక్టర్‌తో నాని మూవీ.. ఈ టైటిల్ ఎవరూ ఊహించరు!

స్వయంకృషితోనే సినిమాల్లోకి అడుగు పెట్టి కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు టాలెంటెడ్ గాయ్ నాని. సహజ సిద్దమైన నటనతో ప్రతి మూవీని వన్ మ్యాన్ షోగా మార్చేసిన అతడు.. నేచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకూ రేంజ్‌ను పెంచుకుంటోన్న నాని.. వరుస చిత్రాలతో సందడి చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు అతడు 'హాయ్ నాన్న' అనే మూవీలో నటిస్తున్నాడు. ఇది విడుదల కాకముందే ఇప్పుడు ఈ స్టార్ హీరో మరో ప్రాజెక్టును సైతం ప్రకటించేశాడు.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే నేచురల్ స్టార్ నాని ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నాడు. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన 'అంటే.. సుందరానికీ' పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు స్ట్రాంగ్‌గా కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్టుతో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీని RRR నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే, కొన్ని కీలక వివరాలను కూడా రివీల్ చేశారు.

Saripodha Sanivaaram Title Fix for Nani and Vivek Athreya Movie

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన UNCHAINED అప్‌డేట్‌ను అక్టోబర్ 23న వదలబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన వీడియోలో తెలిపారు. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం అక్టోబర్ 24వ తేదీన ఫిక్స్ చేసినట్లు కూడా వెల్లడించారు. ఈ కాంబోపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

Saripodha Sanivaaram Title Fix for Nani and Vivek Athreya Movie

వివేక్ ఆత్రేయ సినిమాలు అంటేనే ఎంతో విభిన్నంగా సాగే కంటెంట్‌తో రూపొందుతోంటాయి. గతంలో అతడు చేసిన 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికీ' చిత్రాలు కంటెంట్ పరంగా ప్రేక్షకుల మెప్పును పొందాయి. ఇప్పుడు కూడా అదే పంథాను ఫాలో అవుతూ నాని కోసం అతడు డిఫరెంట్ కాన్సెప్టును రెడీ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారట. ఇప్పటికే దీన్ని డీవీవీ సంస్థ ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X