Saripodhaa Sanivaaram Trailer Review: యమ, చిత్ర గుప్తుడు కలిస్తే.. సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూ!

RRR లాంటి చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య నటించారు. ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

చిన్నతనంలో హీరో నానికి ఎదురైన ఓ సమస్యతో ప్రతీ శనివారం హత్యలు చేస్తుంటారనేది సినిమా కథగా కనిపించింది. ఇక ఓ గ్రామంలో ఇన్స్‌పెక్టర్ దయా దుర్మార్గంగా ఉంటాడు. హింసాత్మకంగా వ్యవహరిస్తుండటంతో గ్రామస్థులకు సమస్యగా మారుతుంది.

Saripodhaa Sanivaaram Trailer Review Nani looks angry young man in Vivek Athreya s action drama

మహిళా కానిస్టేబుల్ ప్రియాంక అరుల్ మోహన్ కనిపించింది. అయితే సీఐ దురాగాతాలకు అంతం ఎప్పుడు అంటూ అడుగుతుంది. సోకులాపాలెంలో పుట్టడమే ప్రజలు చేసిన తప్పు.. అంటూ కానిస్టేబుల్ బాబాయ్ అంటాడు. సోకులాపాలెంని ప్రజలను సీఐ హింసించడమనేది బ్యాక్ డ్రాప్‌గా కనిపించింది.

అయితే నానికి కోపం వస్తే శివతాండవం ఆడించే యువకుడు సూర్యగా కనిపించాడు. అతడి తండ్రిగా సాయికుమార్ నటించాడు. కానిస్టెబుల్ ప్రియాంక వెళ్లి సూర్య గురించి అడిగితే.. చిత్రగుప్తుడు, యముడు స్ప్లిట్ పర్సనాలిటీతో ఒకడే ఉంటే.. అతడే మా అబ్బాయి సూర్య అంటాడు.

Saripodhaa Sanivaaram Trailer Review Nani looks angry young man in Vivek Athreya s action drama

తాను ఎవరైనైనా దండించాలంటే.. వాడి పేరును తన చిట్టాలో రాసుకొంటాడు. ఆ క్రమంలో సూర్య తన చిట్టాలో దయా పేరును రాసుకోవడంతో కథలో ట్విస్టును రివీల్ చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. దసరా తర్వాత మరోసారి పూర్తి యాక్షన్ డ్రామాతో కనిపించనున్నాడు. ఆ క్రమంలో పోలీస్‌ అధికారిని చంపేందుకు సూర్య శనివారాన్ని ఎంచుకొంటాడు. అయితే శనివారమే ఎందుకు ఎంచుకొన్నాడనేది సినిమా కథగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X