పోటీ అన్నారుగా , అది నాని లెక్క.. యూఎస్ ప్రీమియర్స్‌లో సూపర్‌స్టార్‌పై పై చేయి

ఓవర్సీస్ లాభాల దృష్ట్యా అక్కడి థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఎవరు ఔనన్నా కాదన్నా ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగిన మాట వాస్తవం. అలాగని నిర్మాతలు ఎంత రేట్ చెబితే అంతకు కొనేస్తే.. అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెరిగిపోతుంది. ఓవర్సీస్‌లో లాభాలు కూడా అంత ఈజీ కాదు.. స్టార్ హీరోల సినిమాలకు ఈ టార్గెట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల లెక్కలు వేసుకుని రైట్స్ తీసుకోవడం మంచిదని విశ్లేషకుల అభిప్రాయం.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన మూవీ సరిపోదా శనివారం. ఇందులో తమిళ దర్శకుడు , నటుడు ఎస్‌జే సూర్య విలన్‌ రోల్ పోషిస్తున్నారు. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం మూవీని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగ్గా.. చిత్ర యూనిట్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

Saripodhaa Sanivaaram vs The GOAT natural star nani upper hand on thalapathy vijay at premieres Pre-Sales in USA here s the details

ఓవర్సీస్‌లో ప్రత్యేకించి అమెరికన్ మార్కెట్‌లో నాని సినిమాలు బాగానే గిట్టుబాటవుతాయి. అయితే ఈసారి మాత్రం ఆయన సినిమాకు స్టార్ సినిమా అడ్డంకిగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో , ఇళయ దళపతి విజయ్ నటించిన గోట్ నుంచి గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నాని సరిపోదా శనివారం ఆగస్ట్ 29న రిలీజ్ అవుతుండగా.. విజయ్ గోట్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.

సరిపోదా శనివారానికి తమిళ్‌లోనే మంచి మార్కెట్ ఉంది.. దీనికి తోడు ఎస్‌జే సూర్య విలన్ కావడంతో అక్కడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మినిమం మూడు వారాలు కుమ్మేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇలాంటి దశలో గోట్ దిగుతుండటంతో సరిపోదా శనివారానికి డ్యామేజ్ ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఎంత పోటీ ఉన్నా నానికి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు ఆయన అభిమానులు . ఇందుకు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూపిస్తున్నారు. విజయ్ గోట్‌కు అమెరికాలోని 295 సెంటర్స్‌లో ప్రీమియర్స్ వేయనున్నారు. ప్రీమియర్స్‌కు ఇంకా ఏడు రోజుల సమయం ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ కింద ఇప్పటి వరకు 2,50,560 డాలర్లు ( భారత కరెన్సీలో రూ. 2 కోట్ల 10 లక్షల 37 వేల 719 ) వచ్చాయట.

ఇక నాని సరిపోదా శనివారం విషయానికి వస్తే.. ఇవాళ అమెరికాలోని 415 లోకేషన్స్‌లో ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కింద ఈ సినిమాకు 3,12,356 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.2 కోట్ల 62 లక్షల 26 వేల 284) వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీనిని బట్టి నాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X