Sarkaaru Noukari Movie Trailer review సింగర్ సునీత కొడుకుకు నిరోధ్ కష్టాలు..సర్కారు నౌకరీ ట్రైలర్ ఎలా ఉందంటే?
టాలీవుడ్‌లో ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నారు. ఆయన నటించిన సర్కారు నౌకరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, శేఖర్ కమ్ముల, తనికెళ్ల భరణి, సింగర్ సునీత తదితరులు హాజరయ్యారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే.
సర్కారు నౌకరీ సినిమా ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. మండల ఆఫీస్‌లో పనిచేసే హెల్త్ ఇన్స్‌పెక్టర్ గోపాలం పాత్రలో సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు నటించాడు. ఆయన భార్యగా నూతన నటి భావన నటించింది. అయితే కొత్తగా పెళ్లి జరిగిన తర్వాత చిలిపి, శృంగారం ఈ రెండు పాత్రల మధ్య కనిపించింది.

ఇక తెలంగాణ నేపథ్యంతో సాగే ఊర్లో హెల్త్ సెంటర్‌లో ఇంజెక్షన్ల వాడకం, నిరోధ్ వాడకం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించిన గోపాలంకు గ్రామస్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తయ్యాయి. వాటిని అధిగమించేందుకు, ఊర్లో వారికి నచ్చె జప్పే విషయం ట్రైలర్‌లో కనిపించింది. ఇక నిరోధ్ వాడకం తెలియక ప్రజలు పిచ్చిగా వాడిని యూజ్ చేయడం కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారినప్పటికీ.. దాని వెనుక సీరియస్ విషయాలపై కథ సాగినట్టు పాత్రల ప్రవర్తన ద్వారా తెలిపింది.
హెల్త్ ఇన్స్‌పెక్టర్ గోపాలంకు బుగ్గలోడు అంటూ పేరు పెట్టి గేలిచయడం భార్యకు ఇబ్బందిగా మారింది. దాంతో భర్త చేసే ఉద్యోగంపై కొంత వెగటుపుట్టడంతో భార్యభర్తల మధ్య విభేదాలు కనిపించాయి. గోపాల్ ఊర్లోని వారిని, భార్యను ఎలా మెప్పించి తన సర్కారు నౌకరిని నిలబెట్టుకొన్నాడనేది ఈ సినిమా కథగా అర్ధమైంది.
గోపాలంగా ఆకాశ్, ఆయన భార్యగా భావన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించారు. తొలి చిత్రమైనా ఆకాశ్ కొత్తవాడిగా అనిపించకుండా పెర్ఫార్మెన్స్ పరంగా జాగ్రత్తపడ్డాడు. ఈ సినిమాలో తనికెళ భరణి లీడ్‌గా కొత్తగా కనిపించారు. ఈ సినిమా మరో బలగం సినిమా కోవలో గ్రామస్థుల మధ్య ఎమోషన్‌గా కనిపించింది.


Click it and Unblock the Notifications











