సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్.. మహేష్ మెంటల్ మాస్ స్వాగ్.. 105 షాట్స్ రెడీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సర్కారు వారి పాట మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ స్టైల్ తో అలరించబోతున్నాడు అని ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ చూస్తేనే అర్థం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ కూడా ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

డిఫరెంట్ మాస్ లాంగ్వేజ్
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారిపై పాట సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయిని పెంచింది.

ప్రమోషన్స్ లో బిజీగా..
తప్పకుండా సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్ ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయారు. ఇప్పటికే విడుదలైన పాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

ట్రైలర్ రెడీ.. టైమ్ ఫిక్స్
సినిమాలోని కళావతి పాట యూ ట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు తమన్ మరోసారి ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం రోజు విడుదల చేయబోతున్నారు. రెండు నిమిషాల నిడివితో ఉండే ఆ ట్రైలర్ లో సోమవారం సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదలచేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది.

మెంటల్ మాస్ స్వాగ్.. 105 రకాల షాట్స్
ఇక ట్రైలర్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. మహేష్ బాబు మెంటల్ మాస్ క్యారెక్టర్ కు సంబంధించిన 105 రకాల షాట్స్ కూడా చూపించబోతున్నట్లు ఒక మినీ టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ట్రైలర్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు చాలా రోజులుగా వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే మహేష్ బాబు డైలాగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.
సినిమా ఎలా ఉంటుందంటే..?
ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అని ముఖ్యంగా సూపర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకునే విధంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయని, ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో మహేష్ బాబు కీర్తి సురేష్ కు సంబంధించిన రొమాంటిక్ కామెడీ సన్నివేశాలు కూడా ఉంటాయని ఇక చివర్లో సరికొత్త సందేశం కూడా ఆలోచింపజేస్తుంది అని దర్శకుడు ఇదివరకే వివరణ ఇచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











