Official: మహేష్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.. 'సర్కారు వారి పాట' ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు అదృష్టవశాత్తు గత ఏడాదిని మిస్ కాలేదు. 2020 సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ 2021ని మిస్ కావాల్సి వస్తోంది. చాలా మంది అగ్ర హీరోల సినిమాలు గత ఏడాదిలోనే రావాల్సి ఉండగా అనుకోకుండా కరోనా ధాటికి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక మహేష్ బాబు నెక్స్ట్ మరో సంక్రాంతిని టార్గెట్ చేశాడు.

మహేష్ సరికొత్త లుక్..
సర్కారు వారి పాటతో సిద్ధం కానున్న మహేష్ బాబు ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గీత గోవిందం వంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు.

మొదట ఆ డేట్ అనుకున్నారు..
మొదట సినిమా షూటింగ్ ను సమ్మర్ ఎండింగ్ లోపు పూర్తి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. కుదిరితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో మహేష్ శ్రీమంతుడు సెంటిమెంట్ ను ఫాలో కానున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. 2021లో ఆగస్టు 21న సర్కారు వారి పాట మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు గాని వర్కౌట్ కాలేదు.

పోస్టర్ తో క్లారిటీ ఇచ్చిన మహేష్ టీమ్
ఫైనల్ గా 2022 సంక్రాంతికే రానున్నట్టుకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా అందులో మహేష్ తాళం గుత్తి చేతిలో పట్టుకొని కనిపించాడు. ఇక ఇప్పటికే 2021 మొత్తం పెద్ద సినిమాలు మిడియమ్ సినిమాలతో ఫుల్ అయ్యాయి. గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరు హాలిడేస్ ను టార్గెట్ చేసేశారు. ఇక మహేష్ పెద్దగా ఇబ్బంది లేకుండా ఎప్పటిలానే సంక్రాంతిని టార్గెట్ చేశాడు.

మళ్ళీ అదే సెంటిమెంట్..
2020లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక నెక్స్ట్ ఈ అదే సమయానికి సర్కారు వారి పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో ఒక సీనియర్ హీరో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











