twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను సారీ చెప్పను.. హామీ కూడా ఇవ్వను.. మురుగదాస్!

    |

    విజయ్ నటించిన సర్కార్ చిత్ర గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్, మురుగదాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కానీ తమిళనాడు ప్రభుత్వాన్ని, జలయలిత ఖ్యాతిని దిగజార్చేలా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అన్నా డీఎంకే పార్టీ మంత్రులే పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతో వివాదం పెరిగింది. అన్నా డీఎంకే పార్టీ ప్రవేశ పెట్టిన పథకాల్ని మంటల్లో తగలబెట్టే సన్నివేశాలు ఉంటాయి.

    అలాగే ప్రతినాయక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర జయలలితని కించపరిచే విధంగా ఉందనేది మరో ప్రధాన ఆరోపణ. వివాదం కారణంగా అన్నా డీఎంకే పార్టీ కార్యకర్తలు సర్కార్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ పై దాడులకు పాల్పడ్డారు. వివాదం పెద్దదవుతున్న సమయంలో అభ్యంతరకర సన్నివేశాలని తొలగించడానికి చిత్ర యూనిట్ అంగీకరించింది. దీనితో వివాదం కాస్త తగ్గింది. కానీ ఇటీవల అన్నా డీఎంకే పార్టీ నేతలు మరో డిమాండ్ చేశారు. మురుగదాస్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు.

     Sarkar director AR Murugadoss refuses to apologize to TN government

    బహిరంగ క్షమాపణలతో పాటు తన తదుపరి చిత్రాల్లో ప్రభుత్వాన్ని విమర్శించానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. దీనికి మురుగదాస్ సంచలన సమాధానం ఇస్తూ ప్రభుత్వానికి ఎదురెళ్ళారు. నేను క్షమాపణ చెప్పను.. లిఖిత పూర్వకంగా హామీ కూడా ఇవ్వను అని తెగేసి చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది. దీనితో ప్రభుత్వం, సర్కార్ చిత్ర యూనిట్ మధ్య మరోమారు అగ్గి రాజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Sarkar director AR Murugadoss refuses to apologize to TN government. A.R.Murugadoss has been instructed by the government of Tamil Nadu to tender an unconditional apology to the government for the objectionable scenes in Sarkar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X