SVP Advance Booking సర్కారు వారి పాటకు అక్కడ భారీ దెబ్బ.. అయినా RRR రికార్డుపై గురిపెట్టిన మహేష్
గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం, సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తార కీర్తీ సురేష్ కాంబినేషన్‌లో వస్తున్న సర్కారు వారీ పాట రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తూ రికార్డు కలెక్షన్లను రాబట్టడం సంచలనంగా మారింది. అమెరికా, హైదరాబాద్‌లో ఈ చిత్రం రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. అయితే కడపటి వార్తలు అందే సరికి సర్కారు వారీ పాట సినిమా అడ్వాన్సు బుకింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సర్కారు వారీ పాటకు డాక్టర్ స్ట్రేంజ్ షాక్
బాక్సాఫీస్ కలెక్షన్లకు అడ్డాగా మారిన అమెరికాలో మహేష్ బాబుకు డాక్టర్ స్ట్రేంజ్ 2 సినిమా కారణంగా భారీ దెబ్బ పడింది. సర్కారు వారీ పాట సినిమాను XD, RPX, సోని డీసీ స్క్రీన్లలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే ముందస్తుగా హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రం బుక్ చేసుకోవడంతో ఆ థియేటర్లు లభించలేదు. XD, RPX, సోని డీసీ స్క్రీన్లు అత్యాధునిక సాంకేతికతోపాటు భారీ స్థాయిలో ప్రేక్షకులు కూర్చోవడానికి కెపాసిటీ ఉన్న థియేటర్లు కావడం గమనార్హం.

అమెరికాలో రికార్డు స్థాయిలో
అయితే సర్కారు వారీ పాటకు పెద్ద థియేటర్లు ఇవ్వకపోయినా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 650k డాలర్లను వసూలు చేయడం విశేషంగా మారింది. యూఎస్‌లో మహేష్ మానియాకు సర్కారు వారీ పాట సాక్ష్యంగా నిలిచింది.

భీమ్లా, రాధేశ్యామ్ రికార్డుల బ్రేక్
అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అమెరికాలో సర్కారు వారీ పాట చిత్రం ఆచార్య, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ చిత్రాల కలెక్షన్లను అధిగమించింది. ఆచార్య 214k, రాధేశ్యామ్ చిత్రం 259k , భీమ్లా నాయక్ 285k డాలర్లు వసూలు చేయగా సర్కారు వారీ పాట 650k వసూలు చేయడం గమనార్హం. RRR మూవీ అత్యధికంగా 897K డాలర్లు వసూలు చేయడం రికార్డుగా మారింది.

హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ రచ్చ
సర్కారు వారి పాట హైదరాబాద్‌లో RRR సినిమా సాధించిన అడ్వాన్సు బుకింగ్ రికార్డుపై కన్నేసింది. రాధేశ్యామ్ 4.08 కోట్లు, భీమ్లా నాయక్ చిత్రం 4.7 కోట్లు వసూలు చేయగా, ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం 6.18 కోట్లు రాబట్టింది. ఇంకా ఒక రోజు మిగిలి ఉండగా, RRR సాధించిన 7.38 కోట్ల అడ్వాన్సు బుకింగ్ కలెక్షన్లను అధిగమించేందుకు సర్కారు వారి పాట దూసుకెళ్తున్నది.

బెంగళూరు, చెన్నైలో
ఇక కడపటి సమాచారం అందే వరకు బెంగళూరు, చెన్నైలో కూడా ఓ మోస్తారు వసూళ్లను సర్కారు వారీ పాట అడ్వాన్సు బుకింగ్ రూపంలో సాధించింది. బెంగళూరులో 496 షోలతో 23 శాతం అక్యుపెన్సీతో 1 కోటి రూపాయలు, చెన్నైలో 136 షోస్ తో 21 లక్షలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











