మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త: అనుకున్న టైం కంటే ముందే ‘సర్కారు వారి పాట’

ఆ మధ్య కాలంలో కొన్ని పరాజయాలతో తెగ ఇబ్బందులు పడినప్పటికీ.. కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇలా విజయాలను అందుకోవడమే కాదు.. తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దీంతో అతడి అభిమానులు కూడా ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఇక, ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

హ్యాట్రిక్‌తో హవా చూపిస్తోన్న మహేశ్

హ్యాట్రిక్‌తో హవా చూపిస్తోన్న మహేశ్

కెరీర్‌లో తొలిసారి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తీసిన 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్‌ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేసి తెలుగులో హవా చూపిస్తున్నాడు.

సర్కారు వారి పాట పాడుతున్నాడు

సర్కారు వారి పాట పాడుతున్నాడు

ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదలపై ఎన్నో వార్తలు వస్తున్నాయి.

స్టోరీ లైన్ ఇదే.. క్యారెక్టర్ హైలైట్‌ అని

స్టోరీ లైన్ ఇదే.. క్యారెక్టర్ హైలైట్‌ అని

బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట' మూవీ రూపొందుతోంది. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఇందులో మహేశ్ క్యారెక్టర్ హైలైట్‌గా ఉండబోతుందని తెలిసింది.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టాడు

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టాడు

కొద్ది రోజుల క్రితం 'సర్కారు వారి పాట' నుంచి టీజర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా టాలీవుడ్‌లో రికార్డులు కొట్టేసింది.

మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా షూట్ చేశారు. వీటికి సంబంధించిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
అనుకున్న టైం కంటే ముందే రెడీగా

అనుకున్న టైం కంటే ముందే రెడీగా

కొద్ది రోజుల్లోనే 'సర్కారు వారి పాట' చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలు పెట్టబోతున్నారట. దీన్ని నవంబర్ చివరికల్లా పూర్తి చేయబోతున్నారట. అంతేకాదు, డిసెంబర్‌ రెండో వారానికే ఫస్ట్ కాపీని రెడీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి అనుకున్న టైం కంటే ముందే షూట్ కంప్లీట్ చేయబోతున్నారట. ఇదే జరిగితే మూవీ సంక్రాతికి వచ్చేస్తుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X