సర్కారు వారి పాట మరో సంచలనాత్మక రికార్డు.. మహేష్ బాబు అస్సలు తగ్గట్లేదుగా..

గత వారం మహేష్ బాబు స్టైలిష్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఆ ఒక్క పోస్టర్ తోనే సర్కారు వారి పాట టీమ్ నెవ్వర్ బిఫోర్ అనేలా బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఇచ్చిన ఆ లుక్కు అయితే మామూలుగా లేదని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కొంచెం ఫుల్ ఫొటో పంపితే బావుండేది అని మరికొందరు అనుకున్నారు. కానీ ప్రతిసారి మహేష్ ను అదే తరహాలో చుపోస్తున్నారని ఈసారి పరశురామ్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేశారు.

ఏదేమైనా ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ట్విట్టర్ లో అయితే కొన్ని నిమిషాల్లోనే ఒక బెంచ్ మార్క్ ను అందుకోవడం విశేషం. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ తన కెరీర్ లో అగ్ర హీరోలతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి గీతా గోవిందం హిట్టవ్వడం వలన సర్కారు వారి పాటతో మహేష్ ను ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక సినిమా అయితే రోజురోజుకు మరింత అంచనాలను పెంచేస్తోంది.

ఈ సినిమా అభిమానులకు సరికొత్త కిక్కిస్తుందని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ లుక్ రికార్డులు రోజుకోటి బ్లాస్ట్ అవుతున్నాయి. ఫస్ట్ నోటీస్ అంటూ సూపర్ స్టార్ టీమ్ మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక ట్విట్టర్ లో రికార్డులు మోత కూడా మొదలైంది. ఇప్పటికే 24 గంటల్లోనే ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ పొందడమే కాకుండా అత్యధికంగా రీ ట్వీట్స్ పొందిన పోస్టర్ గా ఒక రికార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫాస్టెస్ట్ 100k లైక్స్ అందుకున్న పోస్టర్ కూడా ఇదే అవ్వడం విశేషం.

Sarkaru Vaari Paata First Notice Becomes Fastest 100K Liked Poster In TFI

ఇంతవరకు టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఈ రేంజ్ లో రికార్డును అందుకోలేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు పోస్టర్ కూడా అప్పట్లో భారీగానే ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఇప్పుడు అదే ఊపుతో వస్తున్న సర్కారు వారి పాట ఎక్కడా తగ్గడం లేదు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

సినిమా కేవలం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదని అభిమానులకు నచ్చేలా మంచి సందేశం కూడా ఉంటుందని దర్శకుడు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకునేలా ఉంటుందని కూడా ఉన్నారు. మరి సినిమా ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి. ఇక 2022 జనవరి 13 సినిమా రాబోతున్నట్లు పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X