Sarkaru Vaari paata: ఫస్ట్ నోటీస్ టైమ్ కూడా ఫిక్స్ అయ్యింది.. ఈ పది రోజులు రచ్చ రచ్చే!

గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఆ తరువాత కరోనా వైరస్ వలన చాలా గ్యాప్ తీలుకోవాల్సి వచ్చింది. చాలా కాలం తరువాత ఒక ఏడాదిని మిస్ కావాల్సి వస్తోంది. ఇక రాబోయే సర్కారు వారి పాట సినిమాతో ఎలాగైనా మరొక బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేసాడు. ఇక సర్కారు వారి పాట షూటింగ్ రాత్రుళ్ళు జరుగుతున్నా కూడా సమయాన్ని లెక్క చేయకుండా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక శనివారం సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ నోటీస్ పేరుతో ఫస్ట్ లుక్ టీజర్ ను వదలబోతున్నారు. ఆ స్పెషల్ సర్ ప్రైజ్ ను సాయంత్రం 4:05కి విడుదల చేయనున్నారట.

Sarkaru Vaari paata first notice time fix latest update

ఇక సర్కారు వారి పాట ట్యాగ్ అయితే అన్ని రకాల సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది. గీత గోవిందం హిట్టయిన అనంతరం దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అభిమానులకు సరికొత్త కిక్కివ్వడం కాయమట. సోషల్ మెస్సేజ్ తో పాటు మాస్ మసాలా యాక్షన్ సీన్స్ అలాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ సన్నివేశాలు చాలానే ఉంటాయట. ఇక సర్కారు వారి పాటకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే అన్ని పాటల యొక్క ట్యూన్స్ సిద్ధం చేసిన థమన్ మొదటి సాంగ్ ను పూర్తిగా రెడీ చేశాడట. సినిమాలో మ్యూజిక్ కూడా సరికొత్తగా ఉంటుందని టాక్ వస్తోంది. మహేష్ బాబు - థమన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో పాటలు అన్ని కూడా బెస్ట్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈసారి సర్కారు వారి పాటతో ఎలాంటి పాటలను అందిస్తారో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. సినిమాలో ఒక సీనియర్ హీరో స్పెషల్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X