Sarkaru Vaari Paata First Review: మహేష్ వన్ మ్యాన్ షో .. సింహంలా గర్జించాడు అంటూ క్రిటిక్ రివ్యూ
ఈ మధ్య పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు సినిమా గురించి ఎవరు, ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియని పరిస్థితి. అంతేకాక ఫ్యాన్స్ సహా మిగతా ప్రేక్షకులు కూడా చాలామంది సోషల్ మీడియాలో వచ్చే రివ్యూ ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే గత కొద్దికాలంగా సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకునే ఉమైర్ సంధు ఇచ్చే రివ్యూలు ఆసక్తికరంగా మారాయి. దాదాపుగా అన్ని సినిమాలకు ఆయన మొట్టమొదట రివ్యూ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమా విడుదల సందర్భంగా ఆయన తన రివ్యూ ఇచ్చేశారు. ఆయన మాటల్లో సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

మరి కొద్ది గంటలలో
మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరి కొద్ది గంటలలోనే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో నదియా, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ట్విట్టర్లో రివ్యూ
ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు పెంచేశాయి. దానికి తోడు సినిమా యూనిట్ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ ఉండడంతో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకులు అందరిలో కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే సినీ అనలిస్ట్ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు తన ట్విట్టర్లో రివ్యూ ఇచ్చారు.

మహేష్ వన్ మ్యాన్ షో
సినిమాలో మహేష్ సింహంలా గర్జించాడు, సినిమా మొత్తం మహేష్ బాబు భుజాల మీద వేసుకొని నడిపించాడు, తనదైన నటనతో యాంగ్రీ లుక్తో మహేష్ బాబు కనిపించిన ప్రతిసారి అతని కోపం థియేటర్ స్క్రీన్ ని కాల్చేస్తుందా అనిపించేంతగా ఉంది. ఈ సినిమాకు ఫుల్ పవర్ మహేష్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన అన్ని సినిమాలలో ఇది ది బెస్ట్ అని చెప్పవచ్చు, సినిమా అంతా మహేష్ వన్ మ్యాన్ షో అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆయన.

చాలా అందంగా కనిపించింది
ప్యూర్ మాస్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని పేర్కొన్నారు. అంతేకాక సినిమాలో ఉన్న యాక్షన్, డ్రామా, కామెడీ, నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సినిమాలో కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది అని ఆయన పేర్కొన్నారు. మహేష్ బాబుతో కీర్తి సురేష్ కెమిస్ట్రీ సూపర్ హాట్ అని వీరిద్దరూ పర్ఫెక్ట్ పెయిర్ అని ఆయన చెప్పుకొచ్చారు.

హిందీలో రిలీజ్ చేయాల్సింది
అంతేకాదు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాల్సి ఉందని ఎందుకంటే ఈ సినిమా కేజిఎఫ్ 2, పుష్ప లాగానే హిందీలో మంచి మార్కెట్ చేసి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకేముంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ రివ్యూ చూసి పండగ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











