సైలెంట్‌గా మొదలైన ‘సర్కారు వారి పాట’: కరోనా భయంతో అలాంటి ప్లాన్లు
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌ను చూపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని విదేశాలకు పరారైపోతున్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ.. షూటింగ్ మాత్రం కొంత భాగమే పూర్తైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయిందట. నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈరోజు నుంచే చిత్రీకరణ మొదలైనట్లు తెలుస్తోంది. ఏమాత్రం హడావిడి లేకుండానే ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతున్నట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతుండడంతో ఈ సినిమా షూట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగానే కోవిడ్ నిబంధనల ప్రకారం చాలా తక్కువ మంది సిబ్బందితో షూట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

దాదాపు ఇరవై రోజుల పాటు సాగనున్న హైదరాబాద్ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. అలాగే, ఓ పాటను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











