SVP first notice: మహేష్ మోత మొదలైంది.. ఫస్ట్ నోటీస్ డేట్ ఫిక్స్.. సినిమా వచ్చేది కూడా అప్పుడే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నెవ్వర్ బిఫోర్ అనే కాంబినేషన్స్ చాలానే వస్తున్నాయి. ఇక మహేష్ బాబుతో దర్శకుడు పరశురామ్ చేస్తున్న సర్కారు వారి పాట సినీ ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ అని చెప్పవచ్చు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ కూడా వచ్చేసింది ఫస్ట్ నోటీస్ ఇవ్వడానికి సూపర్ స్టార్ టీమ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా ఫైనల్ గా పోస్టర్ తోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు.
Recommended Video

అంచనాలకు తగ్గట్లుగానే
సర్కారు వారి పాట యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు. సినిమాలో మంచి మెస్సేజ్ కూడా ఉంటుందట. అభిమానులు చొక్కాలు చింపుకునేలా ఉంటుందని ఇదివరకే దర్శకుడు పరశురామ్ క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందని అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నాడు.

జూలై 31న ఫస్ట్ నోటిస్
దర్శకుడు పరశురామ్ గీతగోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా సినిమా మరో లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక అప్పుడెప్పుడో సంక్రాంతి రిలీజ్ అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా మళ్ళీ మరొక అప్డేట్ రాలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా జూలై 31న ఫస్ట్ నోటీస్ పేరుతో ఒక ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది.

యాక్షన్ లుక్
ఫస్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు యాక్షన్ లుక్ తోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిలో ఎదో బ్యాగ్ పట్టుకొని ఉండగా చుట్టూ రౌడీలను కొట్టేసినట్లు ఉంది. సూపర్ స్టార్ అయితే నెవ్వర్ బిఫోర్ అవతార్ లో దర్శనమిస్తాడాని మరోసారి చిత్ర యూనిట్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది.

సినిమా రిలీజ్.. అప్పుడే
సర్కారు వారి పాట టీమ్ మోత మొదలు పెడదమా అనే క్యాప్షన్ తో సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేసింది. ఇక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ పై మొన్నటి వరకు ఎన్నో అనుమానాలు వచ్చాయి. సంక్రాంతికి సినిమా వస్తుందా రాదా అనేది అభిమానులను కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా రూమర్స్ కు చెక్ పెడుతూ 2022 సంక్రాంతికి సినిమా రాబోతున్నట్లు పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు.


Click it and Unblock the Notifications











