టెన్షన్ లో మహేష్ ఫాన్స్.. సర్కారు వారి పాట నుంచి మరో లీకేజీ.. ఇదేం గోల?
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది. ఆయన ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ నెలకొంది. దానికి కారణం ఈ సినిమా నుంచి ఒక లీక్డ్ బిట్ ఇప్పుడు రచ్చ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

అనూహ్యంగా సర్కారు వారి పాట
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయొచ్చని ముందు ఊహాగానాలు వెలువడినా అనూహ్యంగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

హైదరాబాద్ లో షూట్
మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లోజరిపారు. రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో ఇప్పుడు జరుగుతోంది. కోవిద్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు.

మొన్న లీక్డ్ పిక్స్, ఈరోజు లీక్డ్ వీడియో
అయితే నిన్న రాత్రి షూటింగ్ ప్రదేశం నుంచి ఒక వీడియో లీక్ అయింది. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. మొన్న లీక్డ్ పిక్స్, ఈరోజు లీక్డ్ వీడియో, రేపు మూవీ లీక్ చేస్తారేమో ? ఇలాంటి లీక్డ్ పిక్స్, వీడియోస్ ను ఎంకరేజ్ చేయద్దు అని మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అంతే కాదు కొందరు ఫ్యాన్స్ అయితే ఇంత జరుగుతుంటే ఏం పీకుతున్నారు అంటూ కాస్త ఘాటుగానే ఫైర్ అవుతున్నారు.

టెన్షన్ లో ఫాన్స్
అంతే కాక మహేష్ బాబు లుక్ చూసిన వారు అయితే వింటేజ్ మహేష్ ని మళ్ళీ చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ ఫాన్స్ కొందరు అయితే కో ఫాన్స్ అయినా సరే ఈ వీడియో ని షేర్ చేస్తూ ఉంటే ఊరుకోమని అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద లీక్డ్ వీడియో ని సోషల్ మీడియాలో లేకుండా చేయడానికి మహేష్ ఫాన్స్ పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు. వాళ్లంతా ఒకరంగా టెన్షన్ లో ఉన్నారని అంటున్నారు.

రిలీజ్ ఫిక్స్
ఇక ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. ఇక సర్కారు వారి పాట షూటింగ్ అక్టోబర్ లో పూర్తి చేస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











