Mahesh Babu అభిమానులకు గుడ్ న్యూస్ . సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ డేట్, టైమ్ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై రోజురోజుకు అంచనాల స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చివరగా గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణం వల్ల కుదరలేదు. సర్కారు వారి పాట మూవీ కంటే ముందే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ కానీ మహేష్ బాబు అనుకున్నట్లుగా ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు.

ఇక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సర్కారు వారి పాట పైన పెట్టాడు. బాక్సాఫీసు వద్ద ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రమోషన్ డోస్ కూడా పెంచారు.

Sarkaru vaari paata Mahesh babu birth day blaster date and time fix

ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో ఆ రోజు అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చేలా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నారు.ఆ టీజర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు అవుతున్నాయి. అలాగే మొదటి పాటను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న అభిమానులకు నాన్ స్టాప్ అప్డేట్స్ ఇచ్చేలా మైత్రి మూవీ మేకర్స్ పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. ఆగస్టు 9న మొదటి నిమిషంలో అంటే 12 గంటలకు ఒక పోస్టర్ ను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ఒక స్పెషల్ టీజర్ ను విడుదల చేయనున్నారు.

అలాగే మిగతా సినిమాల అప్ డేట్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న SSMB 28 ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేయనున్నారట. ఇక రాజమౌళి కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఇప్పట్లో రాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి RRR సినిమాతో చేయాల్సిన సినిమా యొక్క కదా పూర్తిగా సెట్ అయితేనే ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఇక రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పినదాన్ని బట్టి అయితే ఇంకా పూర్తిగా కథ సెట్టవ్వలేదని తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో కథలు రాయాలని ఆలోచనతో ఉన్నప్పటికీ ఇంకా కథని దర్శకుడు రాజమౌళి అయితే ఫైనల్ చేయలేదని ఆయన తెలియజేశారు. ఎప్పుడైతే రాజమౌళి ఓకే చేస్తారో అప్పుడే సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ రావచ్చని సమాచారం. ఇక సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X