Sarkaru Vaari Paata: మహేశ్ మూవీకి ఆ సర్టిఫికెట్.. టోటల్ రన్ టైమ్ ఎంతంటే!
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడతను. అంతేకాదు, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకోవడంతో పాటు తన మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమాల చేయాలని అనుకున్నాడు. కానీ, అది వర్కౌట్ కాకపోవడంతో పరశురాం పెట్లతో 'సర్కారు వారి పాట' మూవీని చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కొంత కాలం గ్యాప్ తీసుకున్న తర్వాతనే మొదలు పెట్టారు. అయినా.. అప్పటి నుంచి దీన్ని ఏకధాటిగా నడపలేదు. దీనికి కారణం మధ్యలో పలుమార్లు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కావడమే. అంతేకాదు, ఒకసారి మహేశ్ బాబు కాలికి సర్జరీ జరగ్గా.. మరోసారి అతడు కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ మూవీని విడుదలకు రెడీ చేశారు.

మహేశ్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఆ తర్వాత మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని అంచనాలకు అనుగుణంగానే దీన్ని పక్కా కమర్షియల్ మూవీగా రూపొందించారు. అలాగే, ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్లు అన్నీ వాటిని రెట్టింపు చేసేలానే ఉన్నాయి. ఫలితంగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన థియేట్రికల్ హక్కులన్నీ రికార్డు ధరలకు అమ్ముడు పోయినట్లు ఇప్పటికే ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది.
మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీని మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలు, ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇక, ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల 25 సెకెన్ల నిడివితో రాబోతుందని తాజాగా బయటకు వచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా తెలిసింది.

'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











