Sarkaru Vaari Paata: మహేశ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. అనుకున్న టైం కంటే ముందే

కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని వ్యంగ్యంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను పూర్తి చేసేశారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ బాబు సర్జరీతో దీనికి బ్రేక్ పడిపోయింది.

 Sarkaru Vaari Paata New Schedule From January 30th

మహేశ్ బాబు కొంత కాలంగా మోకాలికి సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నాడు. 'స్పెడర్' మూవీ షూటింగ్ సమయంలో అతడి కాలికి గాయం అయింది. దీంతో ఆ తర్వాత అమెరికాలో సర్జరీ చేయించుకోవాలని అనుకున్నాడు. కానీ, అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూనే వచ్చింది. దీంతో మహేశ్ అలాగే ఇప్పటి వరకూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'సర్కారు వారి పాట' షూట్‌లో పాల్గొన్న సమయంలో అతడిని మరోసారి ఆ సమస్య ఇబ్బంది పెట్టింది. దీంతో తాజాగా సూపర్ స్టార్ దుబాయ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత కరోనా బారిన పడి ఈ మధ్యనే కోలుకున్నాడు.

'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ జనవరి 30 అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఎక్కువ రోజులు హైదరాబాద్‌లో జరగనున్న ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఈ క్రమంలోనే ఫిబ్రవరి రెండో వారం నుంచి మహేశ్ బాబు షూటింగ్‌లో భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. అలా మార్చి చివరి నాటికి ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. అదే జరిగితే అనుకున్న దాని కంటే ముందే టాకీ పార్ట్ పూర్తైనట్లు అవుతుంది.

'సర్కారు వారి పాట' సినిమాలో మహేశ్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమా నుంచి ఫిబ్రవరి 14న ఫస్ట్ సాంగ్ రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X