Sarkaru Vaari Paata Event: నా సినిమా కంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి.. అనిల్ రావిపూడి హైలెట్ స్పీచ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. థమన్ అందించిన పాటలు కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది హైదరాబాద్ యూసఫ్ గూడా లో జరిగిన ఈ వేడుకకు పలువురు దర్శకుడు సుకుమార్, సుధీర్ బాబు, అశోక్ గల్లా అలాగే పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా ఈవెంట్ లో తనదైన శైలిలో తన మాటలతో ఆకట్టుకున్నారు.

ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏవిని లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సందిగ్ధమైన ప్రశ్నలు కూడా అడిగి సుమ ఇరకాటంలో పెట్టేసారు. అనిల్ రావిపూడి పెన్నీ సాంగ్ లో మహేష్ బాబు స్టెప్పులు బావున్నాయా.. సీతారా పాప బాగున్నాయా అని అడిగారు. అందుకే సుమ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇష్టమా మహేష్ బాబు గారు ఇష్టమా అని అడిగారు. అంతేకాకుండా ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఇష్టమా 14 రిల్స్ ఇష్టమా.. అని మరొక సందర్భంలో ఒక ప్రశ్న వేశారు. దీంతో సుమ ఆ ప్రశ్నలను తట్టుకోలేకపోయింది.
ఇక ఆ తరువాత సర్కారు పాట సినిమా గురించి మాట్లాడిన అనిల్ రావిపూడి.. చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా లిస్టు విషెస్ అందించారు. ఇక నిర్మాత దర్శకుడు పరుశురామ్ పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాటలతోనే ముందుగానే సినిమాకు మంచి ప్రమోషన్ క్రియేట్ చేశారు. ఇక కీర్తి సురేష్ నిర్మాతలకు కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. మహేష్ గారితో పనిచేయడం ఒక ప్రత్యేకమైన కిక్. ఆయనతో పనిచేసిన ప్రతీ దర్శకుడికి కూడా ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అందరికి ఆయనతో పని చేయాలి అని అనిపిస్తుంది. ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఆయన కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట అంత కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా సర్కారు వారి పాట తరహాలోనే మహేష్ బాబు గారు పాట అనగానే అందరూ బ్లాక్ బస్టర్ అనాలాని.. అభిమానులను కోరారు. ఇక మహేష్ బాబు గారి పాట అనగానే ఫ్యాన్స్ కూడా గట్టిగా బ్లాక్ బస్టర్ అనేశారు.


Click it and Unblock the Notifications











