Sarkaru Vaari Paata: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బిగ్ ఈవెంట్ ప్రకటన వచ్చేసింది!
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ వరుస విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పరశురాం పెట్ల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.
'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ఆలస్యంగా మొదలు పెట్టారు. అయితే, అప్పటి నుంచి దీన్ని ఏకధాటిగా నడపలేదు. దీనికి కారణం మధ్యలో పలుమార్లు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కావడమే. అంతేకాదు, ఒకసారి మహేశ్ బాబు కాలికి సర్జరీ జరగ్గా.. మరోసారి అతడు కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించి.. వాటిని కూడా కంప్లీట్ చేసుకున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఆ తర్వాత మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని అంచనాలకు అనుగుణంగానే దీన్ని పక్కా కమర్షియల్ మూవీగా రూపొందించారు. అలాగే, ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్లు అన్నీ వాటిని రెట్టింపు చేసేలానే ఉన్నాయి. ఫలితంగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన థియేట్రికల్ హక్కులన్నీ రికార్డు ధరలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు కూడా వెల్లడించాయి.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీని మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలు, ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, చిత్ర యూనిట్ ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రకటన వెలువడింది. 'సర్కారు వారి పాట' ఈవెంట్‌ను మే 7వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలారు.
మహేశ్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











