Sarkaru Vaari Paata : మహేష్ చిరునవ్వే నడిపించింది.. ఆ ఒక్క మెసేజ్ ఇక్కడ దాకా తీసుకు వచ్చిందన్న పరశురామ్

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేదిక మీద సినిమా దర్శకుడు పరశురామ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా మొదలు పెట్టడం మొదలు మహేష్ ను ఒప్పించడం ఎలా జరిగింది అనే విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించారు. ఆ వివరాల్లోకి వెళితే..

మీమ్స్

మీమ్స్


పరశురామ్ ను స్టేజి మీదకు పిలుస్తూనే సుమ ఆయన మీద సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ మీమ్స్ అన్నీ కూడా ఎడిట్ చేసి చూపించారు. పెట్ల పరాక్ అంటూ మీ గురించి మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అంటూ సుమ అనడంతో మహేష్ ఫ్యాన్స్ అందరికీ తాను రుణపడి ఉంటానని పరశురామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక తాము గీత గోవిందం సినిమా చేసిన తర్వాత సర్కారు వారి పాట సినిమా కథ రాసుకుని ఆయన వరకు వెళ్లడానికి కొరటాలశివ కారణమని అన్నారు.

కొరటాలకు థాంక్స్

కొరటాలకు థాంక్స్


అందుకే ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అంటూనే మీరు తీసుకు వెళ్లినందుకు చాలా ధన్యవాదాలు ఒకవేళ మీరు తీసుకు వెళ్లకపోయినా కొంచెం లేట్ అయ్యేది, కానీ ఎలాంటి భేషజాలకు పోకుండా నన్ను అక్కడికి తీసుకు వెళ్లి కథ చెప్పినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. ఇక తాను మొట్ట మొదటి సారి మహేష్ బాబుకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను అని లైఫ్ లో మొట్ట మొదటి సారి ఒక పెద్ద హీరోకి కథ చెబుతున్నాను కాబట్టి ఆమాత్రం టెన్షన్ ఉంటుందని ఆయన అన్నారు.

 పేరుపేరునా

పేరుపేరునా


ఇక నిర్మాతల గురించి మాట్లాడుతూ వారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారని నేను ఏదైతే ఊహించుకున్నానో అది కళ్లకు కట్టినట్లు దిగడానికి నిర్మాతలే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పరశురామ్ పేరుపేరునా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు
మరీ ముఖ్యంగా తన డైరెక్షన్ టీం మూడేళ్లపాటు కష్టాలు అనుభవించిన వాళ్ళందరి కష్టమే మమ్మల్ని విజయ తీరాలకు తీసుకు వెళుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

 పేరుపేరునా

పేరుపేరునా


ఇక నిర్మాతల గురించి మాట్లాడుతూ వారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారని నేను ఏదైతే ఊహించుకున్నానో అది కళ్లకు కట్టినట్లు దిగడానికి నిర్మాతలే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పరశురామ్ పేరుపేరునా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు
మరీ ముఖ్యంగా తన డైరెక్షన్ టీం మూడేళ్లపాటు కష్టాలు అనుభవించిన వాళ్ళందరి కష్టమే మమ్మల్ని విజయ తీరాలకు తీసుకు వెళుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

 బ్లాక్ బస్టర్ ఖాయం

బ్లాక్ బస్టర్ ఖాయం


తర్వాత తమన్ ను స్టేజ్ మీదకు పిలిపించిన పరశురాం ఆయనను కౌగిలించుకుని మరియు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా కోసం ముందుగా మేమిద్దరమే జర్నీ మొదలు పెట్టామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు తన భార్య పిల్లలకు కాస్త దూరమయ్యానని కానీ ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 12వ తేదీన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పరశురామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X