Sarkaru Vaari Paata ఈవెంట్ లో మహేష్ బాబు గొప్పతనం.. లేచి నిలబడిన అభిమానులు, గెస్టులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. థమన్ అందించిన పాటలు కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది హైదరాబాద్ యూసఫ్ గూడా లో జరిగిన ఈ వేడుకకు పలువురు దర్శకుడు సుకుమార్, సుధీర్ బాబు, అశోక్ గల్లా అలాగే పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
అయితే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన ఒక ఒక గొప్ప గా పని గురించి ఒక వైద్యుడు చెప్పిన విషయం పై అభిమానులు ఎంతగానో సంతోషించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు గొప్పతనాన్ని కొనియాడుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆంధ్ర హాస్పిటల్స్ చైర్మన్ రామారావు మాట్లాడుతూ మహేష్ బాబు ఇప్పటి వరకు 2500 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారు అని ఇంకా ఇదే తరహాలో ఆయన ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా వివరణ ఇచ్చారు. అలాగే ఆయన సొంత ఊరికి అలాగే మరొక గ్రామానికి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇప్పించడం జరిగిందని అన్నారు. ఇక ఈ సందర్భంగా మహేష్ బాబుకు అందరూ గౌరవం ఇవ్వాలి అని ఈ సందర్భంగా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పడంతో వేడుకకు వచ్చిన అతిథులు అభిమానులు అందరూ కూడా హర్షధ్వానాలతో మహేష్ బాబునీ ప్రత్యేకంగా గౌరవించారు.

సర్కారు వారి పాట ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన మంచి పని గురించి అందరికీ తెలియ డంతో మిగతా గెస్టులు కూడా ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు కొంత అస్వస్థతతో జన్మించాడు అనే అప్పటి నుంచి బయట చిన్నారులకు కూడా సహాయం చేయాలనే ఆలోచన కలిగినట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్ సముద్రకని అలాగే మరికొంత మంది ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ మాస్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు. ఇక ఇది వరకు విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











